హరికృష్ణ మరణానికి కారణమైన వాటర్ బాటిల్

సినీ నటుడు, రాజకీయ నేత నందమూరి హరికృష్ణ మృతిపై నల్లగొండ పోలీసులు మీడియాకు వివరణ ఇచ్చారు. నల్లగొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ చెప్పిన విషయాలను బట్టి హరికృష్ణ మరణానికి వాటర్ బాటిల్ కారణమైందని తెలుస్తోంది. జిల్లా ఎస్పీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

హరికృష్ణ కారు యాక్సిడెంట్ కి అతి వేగంతోపాటు మరో కారణం వాటర్ బాటిల్ అని తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారు 160 కి.మీ. వేగంలో వెళ్తుంది. వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరగడంతో అతి వేగంలో ఉన్న కారు అదుపు తప్పింది. సీటు బెల్టు పెట్టుకోని కారణంగా ఆయన ప్రాణాలను కోల్పోయారు.

వాటర్ బాటిల్ రూపంలో హరికృష్ణను హరించింది మృత్యువు. కారు నడుపుతున్న హరికృష్ణ నల్గొండ అనపర్తి క్రాస్ దగ్గర వాటర్ బాటిల్ కోసం వెనక్కి తిరిగారు. వాటర్ బాటిల్ తీసుకుంటుండగా కారు ఎడమవైపుకు మళ్లింది. ఆయన కుడివైపుకు మళ్లిస్తుండగా వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. కారు మూడు పల్టీలు కొట్టి 15 మీటర్లు ప్రయాణించింది. సీటు బెల్టు పెట్టుకోని కారణంగా హరికృష్ణ అమాంతం కారు నుండి ఎగిరి కంకర గుట్టపైన పడ్డారు. ఆయన తలకి బలమైన గాయాలయ్యాయి. స్థానికులు హాస్పిటల్ కి తరలించినప్పటికీ ప్రయోజనంలేకుండా పోయింది. తలకి బలమైన గాయాలవడంతో ఆయన మరణించారు. కారులో ఉన్న మిగిలిన వ్యక్తులు సీటు బెల్టు పెట్టుకోవడంతో వారికి తీవ్ర గాయాలైనప్పటికి ప్రాణాలకు ప్రమాదం జరగలేదు.

అతివేగం ప్లస్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ప్లస్ వాటర్ బాటిల్ ఈజ్ ఈక్వల్ టూ హరికృష్ణ కన్నుమూత. ప్రతి ఒక్కరికి హరికృష్ణ కారు యాక్సిడెంట్ ఒక గుణపాఠం. అంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ సీటు బెల్టు పెట్టుకున్న కారణంగా కారులో ఉన్న మిగిలినవారు బ్రతికాడు. కానీ సీటు బెల్టును విస్మరించిన కారణంగా హరికృష్ణ అనంత లోకాలకు వెళ్లిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ చెప్పే మాట, జానకి రామ్ మరణానికి కారణం హరికృష్ణకు కూడా వర్తిస్తుందని ఆయన ఊహించినట్టు లేరు. ఇంట్లో మీ కోసం ఎదురు చూస్తుంటారు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అతి వేగం కారణంగా మా పెద్ద అన్నయ్యను కోల్పోయాము. ఆ అబ్దా ఎలా ఉంటుందో తెలుసు. అందుకే స్పీడ్ గా డ్రైవ్ చేయొద్దు అంటూ తారక్ తన ప్రతి పబ్లిక్ ఫంక్షన్స్ లో చెబుతూ ఉంటారు. మళ్లీ స్పీడ్ డ్రైవింగ్ కారణంగా అదే కుటుంబంలోని వ్యక్తి మరణించడం ఎంతో బాధాకర విషయం. గుణపాఠం కూడా…