షాకింగ్: బెజవాడ దుర్గ గుడిలో చైర్మన్ కి ఘోర అవమానం (వీడియో)

ఇంద్రకీలాద్రీ విజయదశమి ఉత్సవాలు లో భక్తుల సహనాన్ని పరీక్షిస్తున్నారు పోలీసులు. మూలా నక్షత్రం సందర్భంగా భక్తులు రద్దీని దృష్టి లో ఉంచుకుని పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారు.

ఈనేపధ్యంలో ఇంద్రకీలాద్రిపై ధర్మకర్తల మండలి చైర్మన్ గౌరంగబాబును ఆలయంలోకి అనుమతించలేదు అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు.

అర్దరాత్రి సమయంలో మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీ దేవి దర్శనం చేసుకునేందుకు వచ్చిన గౌరంగబాబును అడ్డుకున్నారు పోలీసులు. కుటుంబంతో సహా అరగంట పాటు గేటు ముందు నిలిపి వేశారు.

విషయం తెలిసి ఆలయ అధికారులు జోక్యం చేసుకోవడంతో లోనికి అనుమతించారు పోలీసులు. ఉదయం మరోసారి ఆయన కొండపైన వున్న తన కార్యాలయంకు వెళుతుండగా అడ్డుకున్నారు పోలీసులు.

పోలీసుల వైఖరితో మనస్థాపానికి గురైన చైర్మన్ ఇంద్రకీలాద్రికి వెళ్ళకూండానే వెనుదిరిగారు. మరీకాసేపట్లో పోలీసుల తీరుపై పాలకమండలి సభ్యుల సమావేశం కానున్నారు. పోలీసుల వల్ల సామాన్య భక్తులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలీసు కమీషనర్ స్పందన 

నిన్న రాత్రి దుర్గగుడిలో చైర్మన్ కి జరిగిన అవమానంపై స్పందించారు పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమల రావు. కొద్ది సేపటి క్రితం చైర్మన్ ఛాంబర్ కి చేరుకున్నారు ఈఓ కోటేశ్వరమ్మ, పోలీస్ కమీషనర్ తిరుమల రావు. ఈ సందర్భంగా ఛైర్మన్ గౌరంగ బాబుకు క్షమాపణ చెప్పారు పోలీస్ కమీషనర్. దీనికి సంబంధించిన వీడియో కింద ఉంది చూడండి.

ఈరోజు మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకరణలో దర్శనం ఇస్తున్నారు అమ్మవారు. ఆదివారం కూడా కావడంతో ఇంద్రకీలాద్రిపైకి తండోపతండాలుగా జనం పోటెత్తారు. అర్ధరాత్రి నుండే దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు భక్తులు. సుమారు మూడున్నర లక్షలమంది దర్శనానికి రావచ్చని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.