ఇంద్రకీలాద్రి: 8వ రోజు దుర్గాదేవీగా అమ్మవారు

*ఇంద్రకీలాద్రి పై వేంచేసి ఉన్న అమ్మవారి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో 8 వ రోజు అమ్మవారు దుర్గా దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు

*దుర్గా దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. 

 

అమ్మవారి ఎనిమిదవ అవతారం మహాగౌరి. ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకుమెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధి కెక్కింది…

శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||

 

రాష్ట్ర ప్రజల కోసం స్పీకర్ కోడెల పూజ

ఈ రోజు ఎపి స్పీకర్ కోడెల శివప్రసాదరావు  కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకున్నారు. 

ఈ సందర్బంగా మాట్లాడుతూ విజయదశమి పర్వదినాన తెలుగు రాష్ట్రాల ప్రజలందరినీ చల్లగా చూడాలని  అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు.

దుర్గాదేవి పాదాల చెంతన ఏర్పడుతున్న అమరావతి త్వరితగతిన పూర్తి కావాలని,తితిలీ తుఫాన్ బాధితులు త్వరగా కోలుకోవాలని, జీవన ప్రమాణాలు పెరగాలని అమ్మవారిని కోరుకున్నానని ఆయన చెప్పారు.