విషాదం… పుట్టినరోజే మృత్యుఒడికి చేరిన రెండేళ్ల బాలుడు?

ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో ఎలా పొంచి వస్తాయో ఎవరికీ తెలియదు అందుకే మన జాగ్రత్తల్లో మనం ఉంటే కొన్ని ప్రమాదాల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఇలాంటి జాగ్రత్తలు మరింత అవసరం.వారికి ఏ వస్తువు ప్రమాదకరమైనది అనే విషయం కూడా తెలియదు కనుక ప్రతి నిమిషం వారిని కనిపెట్టుకుంటూ ఉండాలి.ఇలా చిన్నారులు తెలియక ఎన్నోసార్లు ప్రమాదం బారిన పడి మృత్యువాత పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది.

మహారాష్ట్ర నాసిక్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. తమ కుమారుడి రెండవ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా చేయాలని భావించిన తల్లిదండ్రులు తమ కొడుకు పుట్టినరోజు కోసం పెద్ద హోటల్ బుక్ చేశారు. ఈ క్రమంలోనే హోటల్ కి వెళ్లి అక్కడ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఆ చిన్నారి ఆడుకుంటూ పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పడిపోయాడు. అయితే తమ కుమారుడు కనిపించలేదని తల్లిదండ్రులు వెతికిన ఎంతసేపటికి వారి బాబు కనిపించలేదు.

చాలా సమయం తర్వాత చిన్నారి నీటి కొలనులో శవమై తేలడంతో ఒకసారిగా ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఇక ఈ విషయం తెలిసి బర్తడే పార్టీలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇలా చిన్నారుల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన పెద్ద ప్రమాదాల బారిన పడటమే కాకుండా మనల్ని తీవ్ర శోకసంద్రంలోకి నెట్టేస్తాయి. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నప్పటికీ తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లల పట్ల ఎంతో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు.