తన పెళ్లిని అనౌన్స్ చేసిన “RRR” నటుడు..దీనిలో కూడా టీవీ9 ని వదలట్లేదుగా!

RRR Actor : రీసెంట్ గా యంగ్ హీరో అయినటువంటి విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం “అశోక వనంలో అర్జున కళ్యాణం” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ప్రాంక్ తో ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ 9 కి తనకి జరిగిన వాగ్వాదం కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ గొడవ కాస్తా మరో మలుపు తీసుకొని ప్రముఖ మరో యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు రాహుల్ రామకృష్ణ వైపు టర్న్ తీసుకుంది.

తాను విశ్వక్ కి అండగా నిలుస్తూ సోషల్ మీడియాలో టీవీ 9 పై చేసిన దాడి అంతా ఇంతా కాదు. ఇప్పటికీ కూడా దాన్ని కొనసాగిస్తూ తగ్గేదేలే అంటున్నాడు ఈ RRR నటుడు. అయితే ఈరోజు ఉదయమే తన పెళ్లిపై అనౌన్స్ చేస్తూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానని తన లైఫ్ పార్ట్నర్ తో లిప్ లాక్ చేసి పోస్ట్ షేర్ చేసి షాకిచ్చాడు.అయితే తన పెళ్లిపై కూడా టీవీ9 ని తాను వదల్లేదు.

తన ఫోటోకి సంబంధించే హేయ్ టీవీ9 ఈ ఫోటో పై మమ్మల్ని ఎందుకు మీ స్టూడియోకి పిలవరు పిలవొచ్చు కదా వస్తాం అంటూ సెటైర్స్ చేసాడు. అలాగే పదండి అందరూ మీరు చెప్పే మెరుపైన సమాజం తీసుకొద్దాం అంటూ ఓ రేంజ్ లో సెటైర్స్ చేస్తూ ఓ రేంజ్ లో టీవీ9 వాళ్ళకి షాక్ మీద షాకిస్తున్నాడు. ఇంకోపక్క అయితే తన ఫాలోవర్స్ రాహుల్ ని టీవీ9 కి పిలిస్తే ఆ లైవ్ డిబేట్ ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

https://twitter.com/eyrahul/status/1523094471667511297?s=20&t=t52PGriHZPkAj28V6M7sCQ