సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాష్‌కీ, టీవీ9 సంస్థకీ సంబంధం లేదంటూ ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ, తాజాగా రవిప్రకాష్, టీడీ9 సంస్థ కార్యాలయంలోకి వెళ్ళారు. అక్కడేవో ‘లెక్కలు’ చూశారట. ఈ అంశం మీడియా, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. టీవీ9 నుంచి రవిప్రకాష్‌ని ఎప్పుడో బయటకు గెంటేశారు.
అయితే, చాలాకాలంగా న్యాయ పోరాటం చేస్తున్నారు రవిప్రకాష్. ఆ పోరాటం ఎక్కడిదాకా వచ్చింది.? అన్నది వేరే చర్చ. అరెస్టులు లాంటి వ్యవహారాలూ నడిచాయి. నీట్‌గా సీఈఓ తరహాలో రెడీ అయి, టీవీ9 కార్యాలయంలోకి ‘రాయల్ లుక్’లో వెళ్ళి వచ్చారు రవిప్రకాష్. పైగా, ‘నేనింకా టీవీ9 భాగస్వామినే. నాకు కొన్ని లెక్కలు అవసరమయ్యాయ్.. అవి చూసుకోవడానికే వచ్చా..’ అని టీవీ9లో లెక్కలు చూసుకుని బయటకు వచ్చాక రవిప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ చెప్పడం గమనార్హం.
ఏం లెక్కలు చూసుకున్నారబ్బా.? అసలు టీవీ9లో రవిప్రకాష్ వాటా ఇంకా ఎంతుందబ్బా.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. టీవీ9 లోగో విషయంలో కుట్ర చేశారనీ.. ఇంకోటనీ.. రవిప్రకాష్ మీద చాలా ఆరోపణలున్నాయి. ఇదిలా వుంటే, రవిప్రకాష్ కొత్త ఛానల్ పెట్టబోతున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. ఇంతలోనే, టీవీ9 కార్యాలయంలోకి రవిప్రకాష్ వెళ్ళి రావడంతో.. మళ్ళీ టీవీ9లోకి ఆయన ఎంట్రీ ఇస్తారా.? అన్న అనుమానాలూ కనిపిస్తున్నాయ్.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, రవిప్రకాష్ ఎగ్జిట్ తర్వాత టీవీ9న తన పాపులారిటీని కోల్పోయింది. అయితే, ‘బ్లాక్‌మెయిలింగ్ ఛానల్’ అనే గుర్తింపు మాత్రం అలాగే వుండిపోయంది.. ఇంకాస్త బలపడింది కూడా అది.!