తిరుమల కొండమీద ‘హెల్ప్ లైన్’

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలనుంచి వచ్చే  భక్తుల కోసం ‘తిరుమల తిరుపతి దేవస్థానాలు’ (టిటిడి)హెల్ప్ లైన్ ప్రారంభించింది. భక్తులు పిలిస్తే పలికేందుకు వీలుగా ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబరు 180004254242 ఏర్పాటు చేశారు. భక్తులకు తిరుమలలో ఏవైనా అనుకోని సమస్యలు ఎదురైనపుడు ఈ నంబరుకు ఫిర్యాదు చేయాలి. వాటిని పరిష్కరించేందుకు అధికారులు వెంటనే ఏర్పాట్లు చేస్తారు. కొండమీది కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో దీనిని ఏర్పాటుచేశారు. ఇక్కడ సిబ్బంది 24 గంటల పాటు అందుబాటులో ఉండి భక్తుల సూచనలు, ఫిర్యాదులను స్వీకరిస్తారని టిటిడి పేర్కొంది.

బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, నూతన సంవత్సరాది తదితర పర్వదినాలలో పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టిటిడి ఈ హెల్ప్ లైన్ ఏర్పాటుచేసింది.

భక్తులకు ఏవయయినా భద్రతాపరమైన ఇబ్బందులు ఎదరైనపుడు సంప్రదించాల్సిన టోల్‌ఫ్రీ నంబర్లు : 18004254141, 1800425333333.

గదుల్లో ఎదురయ్యే సమస్యలతోపాటు దర్శనం, క్యూలు, అన్నప్రసాదం, రిసెప్షన్‌, కల్యాణకట్ట, విజిలెన్స్‌, ఆరోగ్య, ఇంజినీరింగ్‌ విభాగాల సమస్యలెదురయినపుడు భక్తులకు ఎఫ్‌ఎంఎస్‌ హెల్ప్‌లైన్‌ అందుబాటులో ఉంది. ఈ హెల్ప్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నంబరు 1800425111111.

అదేవిధంగా, టిటిడి కాల్‌సెంటర్‌ ద్వారా శ్రీవారి బ్రహ్మోత్సవాల సమస్త సమాచారాన్ని భక్తులు తెలుసుకోవచ్చు. కాల్‌ సెంటర్‌ నంబరు: 0877-2277777, 2233333. వాట్స్‌ యాప్‌ 9399399399, ఈ-మెయిల్‌ : helpdesk@tirumala.org ద్వారా భక్తులు టిటిడి అధికారులను సంప్రదించవచ్చు.

 

ఇది కూాడా చదవండి

తిరుమల గురించి చాాల మందికి తెలియని విషయం