తిరుమల ఏఈవో వేధింపులపై బాధితురాలేమంటుందంటే (వీడియో)

తిరుమలలో లైంగిక వేధింపుల కలకలం రేగింది. ఇప్పటికే పలు వివాదాలతో తరచూ రచ్చకెక్కుతున్న టిటిడిలో ఇప్పుడు మరో వివాదం బయటికొచ్చింది. శ్రీనివాస మంగాపురం ఆలయ ఏఈవో శ్రీనివాస్ తన కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళా ఉద్యోగి చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసలు వివరాలేంటంటే…

శ్రీనివాస మంగాపురం ఆలయంలో  ఓ మహిళా ఉద్యోగిగా పనిచేస్తుంది. ఆఫీసుకు అప్పుడప్పుడు ఆ మహిళా కూతురు వచ్చేది. దీంతో ఏఈవో శ్రీనివాసరావు కన్ను మహిళా ఉద్యోగి కూతురుపై పడింది. ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ సంపాదించిన శ్రీనివాసరావు తరచూ అసభ్య పదాలతో చాటింగ్ చేసేవాడు. ఫోన్ కాల్స్ చేసి వేధించేవాడు. విషయాన్ని తల్లికి చెప్పగా ఆమె శ్రీనివాస్ ను ప్రశ్నించగా ఆమెను కూడా బెదిరించాడు. దీంతో అధికారులను ఆశ్రయించగా టిటిడి విజిలెన్స్ అధికారులు 15 రోజుల నుంచి విచారణ జరుపుతున్నారు. దీనికి తోడుగా మహిళ చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

శ్రీనివాస్ పై గతంలో కూడా లైంగిక వేదింపుల ఫిర్యాదులు ఉన్నాయి. దీంతో అతనిని గతంలో పలు ప్రాంతాల నుంచి బదిలీ చేశారు. అయినా కూడా శ్రీనివాస్ లో మార్పు లేదని సహచరలు అంటున్నారు. లైంగిక వేదింపుల అంశాన్ని సీరియస్ గా తీసుకున్న టిటిడి అధికారులు, విజిలెన్స్ అధికారులు త్వరలోనే శ్రీనివాసులు పై చర్య తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. నిశ్శబ్దంగా ఉన్న తిరుమలలో లైంగిక వేధింపుల అంశం వార్తల్లోకి రావడంతో అంతా హాట్ టాపిక్ గా మారింది.