తిరుమల కొండ పైనుంచే సమర శంఖం పూరించిన వై ఎస్ జగన్ ! 

 

పడ్దవారు ఎప్పుడు చెడ్ద వారు కాదు. కాస్త ఓపిక పడితే అన్ని సర్దుకుంటాయని పెద్దలు అంటారు.. ఈ విషయమే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో నిజమైందంటున్నారు కొందరు.. ఎందుకంటే మొన్నటి వరకు ఏపీలో, రాజధాని అమరావతి అంశం పైన ఎడతెగని చర్చలు నడుస్తుండేవి.. వాటికి ఇప్పుడు విరామం దొరికినట్లైంది. అంతర్వేది లో రథం దగ్ధం, అమ్మవారి సింహాలు మాయం కావడం, అన్యమతస్థులు తిరుమలేశుని దర్శించే సమయంలో డిక్లరేషన్ ఇవ్వాలనే విషయం వివాదం అవడం, ఇలా ఒక్కో సంఘటన వరుసగా తెరపైకి వచ్చాక, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మత రాజకీయాల వైపు మళ్ళాయి.

ఇదే సమయంలో టీడీపీ, బీజేపీ, ఎవరూ ఊహించని రీతిలో దూకుడును ప్రదర్శించాయి.. ఇలాంటి సమయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రావడంతో అందరి చూపులు సీయం జగన్ వైపు మళ్లాయి.. ఆపదలో ఉన్న వారు ఊపిరి పోతున్నా కూడా ఒక్క అవకాశం కోసం ఎదురు చూస్తారు అన్నట్లుగా, వరుసగా జరిగే సంఘటనలతో సతమతం అవుతున్న వైఎస్ జగన్, ఏపీలో జరుగుతున్న మతపర వివాదాలకు చెక్ పెట్టేందుకు తిరుమల కేంద్రంగా సమరశంఖం పూరిస్తున్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయట కొందరిలో.. దీనికి రాజకీయ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారట.

 

ఇకపోతే అధికార పార్టీ వారిని ఇరకాటంలో పడవేసి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ దక్కకుండా చేయాలని చూస్తున్న పార్టీలకి వైఎస్ జగన్ త్వరలోనే సరైన సమాధానం చెబుతారనే ప్రచారం కూడా జరుగుతుంది.. కాగా కొడాలి నాని చేసిన వ్యాఖ్యల పై చెలరేగిన దుమారాన్ని బిజేపీ, టీడీపి అవకాశంగా మలుచు కుందామని ప్రయత్నించాయి.. ఇందులో భాగంగా ఈ రెండు పార్టీలకు కొడాలి నాని టార్గెట్ అయ్యారు. అయితే ప్రస్తుతం కొడాలి నాని ఒక పక్క టీడీపీ అధినేతను ఉతికేస్తూనే, బీజేపీ అగ్రనేతలను లక్ష్యం చేసుకోవడంతో మత రాజకీయాలను పక్కకు జరిపినట్లు అయ్యింది.. ఇలా కొడాలి నాని మత వివాదాన్ని మొత్తం తనచుట్టూ తిప్పేసుకోవడంతో టీడీపీ, బీజేపీ లు మరో కొత్త వ్యూహానికి రంగం సిద్ధం చేసుకోవలసి వస్తుందనుకుంటున్నారట వైసీపీ కార్యకర్తలు.. ఇప్పుడే ఏపీ రాజకీయాలు ఇంత హాట్‌గా సాగుతుంటే ఇక ముందు ముందు మరెంత ఘాటుగా ఉంటాయో..