టిఆర్ఎస్ జైపాల్ యాదవ్ కారుకు యాక్సిడెంట్

టిఆర్ఎస్ పార్టీ నేత, కల్వకుర్తి అసెంబ్లీ అభ్యర్థి జైపాల్ యాదవ్ కారుకు యాక్సిడెంట్ అయింది. మహబూబ్ నగర్ జిల్లాలోని కడ్తాల్ మండలం, ఎక్వాయిపల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి టిప్పర్ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో జైపాల్ యాదవ్ కు ఎలాంటి హాని జరగలేదు. కారు స్వల్పంగా డ్యామేజ్ అయింది. 

టిప్పర్ ఢీకొట్టడంతో కారు ధ్వంసమైన కారు వెనుక భాగం

ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఈప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. టిప్పర్ స్వల్పంగా ఢీకొట్టడంతో ఎవరి ప్రాణాలకు హాని జరగలేదు. ఎమ్మెల్యే అభ్యర్థిని స్థానికులు మరో కారులో అక్కడి నుంచి తరలించారు.

ఈ ఘటనపై కడ్తాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.