హైదరాబాద్ చిలకలగూడలో విషాదం

హైదరాబాద్ చిలకలగూడలో దారుణం జరిగింది. మెట్టుగూడలో తల్లికూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కె. ఆర్తి అనే గృహిణికి ఏడేళ్ల కూతురు తషి ఉంది. ముఖానికి పాలిథిన్ కవర్లు కట్టుకొని ఇంట్లో సిలిండర్ లీక్ చేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. 

ఆర్తి
తషి

 

అందరితో చాలా కలివిడిగా ఉండే వారని అసలు వారు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారో అర్ధం కావడం లేదని పక్కవారు అన్నారు. వారి మృతదేహాలను చూసి అంతా కన్నీరు పెట్టారు. ఆ చిన్న పిల్లను కూడా ఎలా చంపబుద్ది అయ్యిందో అని అంతా అనుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాల కోసం పోలీసులు విచారిస్తున్నారు.