కొండగట్టు బస్సు ప్రమాద మృతుల వివరాలివే

కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో 51 మంది చనిపోయారు. మృతుల్లో 32 మంది మహిళలు, 15 మంది పురుషులు, 4గురు చిన్నారులున్నారు. వీరిలో 38 మంది మృతదేహాలను గుర్తించారు. జగిత్యాల, కరీంనగర్ ఆస్పత్రులలో 37 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించి చికిత్సనందిస్తున్నారు. ఆసుపత్రుల వద్ద మృతుల బంధువుల రోదనలు మిన్నంటాయి. రోదనలతో ఆస్పత్రుల వద్ద విషాద చాయలు అలుముకున్నాయి. మృతదేహాలను గుర్తించిన అధికారులు వారి వివరాలను వెల్లడించారు. వారి వివరాలివే…

1.నామాల మౌనిక 24 సం ( శనివారంపేట)
2. బైరి రిత్విక్ 3సం ( రామసాగర్)
3. పోలు లక్ష్మి 50 ( హిమత్ రావుపేట)
4. చెర్ల లక్ష్మి 45 ( హిమత్ రావుపేట)
5. గండి లక్ష్మీ 60 ( శనివారం పెట)
6. డబ్బు అమ్మయి 50 ( డబ్బు తిమ్మయ్యపల్లి)
7. బండపల్లి చిలుకవ్వ 76 
8. గోలి అమ్మాయి 44 ( శనివారం పేట)
9. తిప్పర్తి వెంకటరత్నం 56 ( తిరుమల పూర్)
10. కంకణాల ఎల్లవ్వ 70 (సండ్రలపల్లి)

11. లాంబ కోటవ్వ 65 ( హిమత్ రావుపేట)
12. బందం లసవ్వ 65 ( ముత్యంపేట)
13. బొల్లారం బాబు 54 ( శనివారంపేట)
14. లైసెట్టి చంద్రయ్య 45 (శనివారంపేట)
15. ఎండికల ఎంకవ్వ ( శనివారంపేట)
16.ఇంద్రికాల సుమ 30 (శనివారంపేట)
17. రాజవ్వ 56 (డబ్బు తిమ్మయ్యపల్లి)
18. ఉత్తమ్ నందిని (కొనపూర్)
19 మాల్యాల అనిల్19 (హిమత్ రావుపేట)
20. గాజుల చిన్నవ్వ 60 ( డబ్బు తిమ్మయ్యపల్లి)

21. శమకురా మల్లవ్వ 38 (తిర్మల్పూర్)
22. సలేంద్ర వరలక్ష్మి 28 (శనివారంపేట)
23. కుంబల సునంద 45 (శనివారంపేట)
24. గుడిసె రాజవ్వ 50 ( శనివారం పేట)
25. పందిరి సతవ్వ 75 (హిమత్ రావుపేట)
26. దాసరి సుశీల 55 (తిరుమలపూర్)
27. రాగల ఆనందం 55 (రామసాగర్)
28. నేదునూరి మదనవ్వ 75 ( హిమాత్రవుపేట)
29. చెర్ల హైమా 30 ( హిమాత్రవుపేట)
30. పిడిగు రాజవ్వ 30 (డబ్బు తిమ్మయ్యపల్లి)

31. చెర్ల గంగవ్వ 75 (శనివారం పేట)
32. ఒడినల లసమవ్వా 55 ( తిమ్మయ్యపల్లి)
33. ఒడినల కాశిరం 65 ( తిమ్మయ్యపల్లి)
34 బొంగిని మల్లయ్య 55 (పెద్దపల్లి)
35. గోల్కొండ లచవ్వ 50( డబ్బు తిమ్మయ్యపల్లి)
36.గోల్కొండ దేవవ్వ 63 ( డబ్బు తిమ్మయ్యపల్లి)
37.కొండ అరుణ్ సాయి 5 (కోరేం) 
38. బొంగోని మదనవ్వా 65(పెద్దపల్లి)

మరో 13 మంది మృతుల వివరాలను కనుగొనాల్సి ఉంది. గుర్తు పట్టిన మృతదేహాలను పోస్టుమార్టం తర్వాత బంధువులకు అప్పగించనున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున్న బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో ఆస్పత్రి ప్రాంగణమంతా శోకసంద్రమైంది.