పైసలిస్తవా ఇయ్యవా… లేకపోతే నీ నగ్న చిత్రాలు బయట పెడుతా

అమ్మాయిలను మోసం చేసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతామంటూ యువకులు బెదిరిస్తున్న ఘటనలు ఇటీవల అనేకం జరుగుతున్నాయి. అందుకు రివర్స్ గా ఓ అమ్మాయే అబ్బాయి పై బెదిరింపులకు పాల్పడింది. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరి చదవాల్సిందే…

గుంటూరు జిల్లా నరసరావు పేటకు చెందిన 23 ఏళ్ల యువకుడు బ్యాటరీల పని చేస్తుంటాడు. అతనికి ఫేసుబుక్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. తరచుగా ఇద్దరూ చాటింగ్ చేస్తుండేవారు. తనకు వివాహమైందని భర్త హైదరాబాద్ లో పనిచేస్తాడని తాను గుంటూరులోని సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తానని తమకు ఒక పాప కూడా ఉందని చెప్పింది.

ఇటీవల తన నగ్న చిత్రమంటూ ఆ యువతి ఓ ఫేక్ ఫోటోను యువకుని ఫేసుబుక్ కు పోస్ట్ చేసింది. నీ నగ్న చిత్రం కూడా పంపు అని కోరడంతో ఆమె కోరినట్టే ఈ అబ్బాయి నగ్న చిత్రాన్ని పంపించాడు. మరుసటి రోజు నుంచి ఆ యువతి తనకు డబ్బు అవసరం ఉందని ఇయ్యకపోతే నీ ఫోటోను ఫేస్ బుక్ , వాట్సాప్ లో పెడతానని బెదిరించింది.

ఆ యువకుడు విజయవాడలోని అశోక్ నగర్ లోని తన అక్క బావ ఇంటికి వచ్చాడు. అక్కడ ఉండగా యువతి ఫోన్ చేసి బెదిరించడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అంతా కలిసి పటమ ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

అమ్మాయిలను బెదిరించిన అబ్బాయిలను చూశాం కానీ నగ్న ఫోటోలతో అబ్బాయిలను బెదిరించిన అమ్మాయిని ఇప్పుడే చూస్తున్నామని పలువురు అన్నారు.