ఆస్తికోసం ప్రియుడుతో కలిసి కట్టుకున్న భర్తని కడతేర్చిన భార్య.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన నిజం!

ఈ మధ్యకాలంలో ఎవరికి బంధం బంధుత్వాల మధ్య ప్రేమాభిమానాలు లేవు కేవలం డబ్బుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు అక్రమ సంబంధాలు పెట్టుకుని డబ్బు కోసం భార్యాభర్తలను కడతేరుస్తూ ఉన్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి తాజాగా ఇలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. గార్మెంట్స్ వ్యాపారం చేస్తూ భారీగా ఆస్తులు సంపాదించిన భర్తనే ఆస్తికోసం చివరికి భార్య కడతేర్చింది.

ముంబై నగరంలోని ఓ ప్రాంతంలో కమల్‌కాంత్ షా, కాజల్ దంపతులు నివాసం ఉంటున్నారు. చాలా ఏళ్లకిందట వీరికే వివాహం జరిగి ఉంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కమల్ గార్మెంట్స్ వ్యాపారం చేస్తూ పెద్ద ఎత్తున ఆస్తులను కూడా పెట్టారు. ఈ విధంగా ఎంతో సవ్యంగా సాగిపోతుందనుకున్న క్రమంలో కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి హితేష్ జైన్ తో తరచూ మాట్లాడుతూ ఉండేది. ఇలా తరచూ ఫోన్ కాల్స్ మాట్లాడుతున్న వీరిద్దరి మధ్య ఈ స్నేహబంధం కాస్త ప్రేమగా మారింది.

ఈ క్రమంలోనే కాజల్ హితేష్ తో కలిసి తన భర్తను కమ ల్ ను చంపడానికి ప్లాన్ చేసింది.ఈ క్రమంలోనే తాను తినే అన్నంలో విషపు గుళికలు కలిపి పెట్టడంతో కమల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే హాస్పిటల్లో చేర్చినప్పటికీ ఫలితం లేకపోవడంతో సెప్టెంబర్ 19వ తేదీ ఆయన కన్న మూశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో భాగంగా కాజాలను విచారించడంతో అసలు విషయం బయటపడింది.