పది సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొని వేరు కాపురం పెట్టారు. ఉన్నంతలో హాయిగా బతికారు. వారికి ఒక కొడుకు, బిడ్డ కూడా ఉన్నారు. ఆనందంగా సాగుతున్న వారి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు పెట్టింది. చివరకు నలుగురి ప్రాణాలు పోయాయి. ఇది ఎక్కడ జరిగిందంటే…
చిత్తూరు జిల్లా మదన పల్లెకు చెందిన శ్రీనివాసులు, బుజ్జమ్మ ఇద్దరిది ఒకే గ్రామం. వీరి పది సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొని ఏర్పేడుకు వెళ్లి కాపురం పెట్టారు. ఆ తర్వాత రాజులకండ్రిగలో స్థలం కొనుక్కొన్నారు. వీరికి ఒక కూతురు, కుమారుడు జన్మించారు. ఆనందంగా వారి జీవితం సాగుతుంది.
ఏర్పేడులోని డిక్సెస్ కంపెనీలో బుజ్జమ్మ, శ్రీనివాసులు ఇద్దరూ పనిచేసేవారు. అక్కడ పని చేసే కొంత మందితో బుజ్జమ్మ సాన్నిహిత్యంగా ఉండటం గమనించిన శ్రీనివాసులు బుజ్జమ్మను మందలించాడు. అయినా కూడా బుజ్జమ్మ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో పని మాన్పించాడు. రాజుల కండ్రిగలో తమకున్న స్థలంలో తాత్కాలిక నివాస ఏర్పాటు చేసుకొని అక్కడ కాపురం పెట్టారు.
రాజులకండ్రిగలో కూడా బుజ్జమ్మ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని శ్రీనివాసులు గమనించాడు. అసలు ఎందుకలా చేస్తున్నావని బుజ్జమ్మను ప్రశ్నించగా అలాంటిదేమి లేదంటూ బుకాయించింది. దీంతో వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.
భర్త పనికి, పిల్లలు బడికి పోగానే గ్రామంలో బుజ్జమ్మతో సంబంధం ఉన్న వ్యక్తి నేరుగా ఇంటికే వచ్చి వెళుతున్నాడని శ్రీనివాసరావు తెలుసుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే డ్యూటికి పోయినట్టు చేసిన శ్రీనివాస్ తన ఇంటి చుట్టుపక్కలనే దాక్కున్నాడు. బుజ్జమ్మతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి ఇంట్లోకి వెళ్లగానే రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాడు. వారిద్దరిని శ్రీనివాసులు మరికొందరి సాయంతో చితకబాదాడు. రెండు రోజుల నుంచి గ్రామంలో లేని శ్రీనివాస్ శనివారం ఇంటికి వచ్చాడు.
భార్య, పిల్లలిద్దరికి అన్నంలో పురుగుల మందు కలిపి ఇచ్చాడు. అది ఫలించలేదు. దీంతో కోపం చెందిన మల్లేష్ వారి మీద పెట్రోల్ పోసి తగలబెట్టి వారు చనిపోయారని నిర్దారించుకున్నాక తాను కూడా పెట్రోల్ పోసుకొని చనిపోయాడు. ఈ మంటల ధాటికి ఇంట్లో ఉన్న సిలిండర్ పేలడంతో వారు బూడిదయ్యారు. గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. గ్యాస్ పేలుడుకు చుట్టు ఇళ్లులు కూడా దెబ్బ తిన్నాయి.
ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. క్షణికావేశంలో చేసిన తప్పుకు అందరూ బలయ్యారని గ్రామస్థులు చర్చించుకున్నారు. సాయంత్రం వరకు ఆడుకున్న పిల్లలు బూడిదలా మారడంతో అంతా కన్నీరు పెట్టారు. బుజ్జమ్మకు ఎన్ని సార్లు చెప్పినా వినలేదని శ్రీనివాసులు తన భార్య ప్రవర్తనను చూసి అనేక సార్లు బాధపడ్డాడని వారన్నారు. తన పిల్లల కోసమే అన్ని భరిస్తున్నానని చెప్పిన శ్రీనివాస్ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడంటే తాము నమ్మలేకపోతున్నామని వారు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.