భార్యతో సహా నెల రోజుల కూతుర్ని దారుణంగా హత్య చేసిన వ్యక్తి…. ఎందుకో తెలుసా?

ప్రస్తుత కాలంలో మనుషుల మధ్య ప్రేమాభిమానాలు పూర్తిగా కరువైపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అని కూడా చూడకుండా గొడవ పడుతూ ఉంటారు. ఈ క్రమంలో గొడవలు వల్ల ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవటమే కాకుండా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడటం లేదు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏర్పడే మనస్పర్ధలు కారణంగా ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులో ఇటువంటి దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకునే సంతోషంగా జీవించాలని అత్తగారింట్లో అడుగుపెట్టిన మహిళకు తాళి కట్టిన భర్తే కాలయముడయ్యాడు.భార్యతో పాటు అభం శుభం తెలియని నెల రోజుల చిన్నారిని సైతం దారుణంగా హత్య చేశాడు.

వివరాలలోకి వెళితే…రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ గ్రామానికి చెందిన ఏర్పుల ధన్‌రాజ్‌ తో లావణ్య అనే మహిళకు నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండున్నర సంవత్సరాల పాప ఉండగా.. గత నెల రోజుల క్రితం బాబు పుట్టాడు. అయితే తాజాగా ధన్‌రాజ్‌ పుట్టింట్లో ఉన్న తన భార్యను బుధవారం రోజున ఇంటికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత అదే రోజు భార్యను గొడలితో దారుణంగా నరికి.. బాబును నీటి సంపులో వేసి హత్య చేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందుతుడు ధన్‌రాజ్ అక్కడి నుంచి పారిపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. లావణ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్య ఘటన గురించి స్థానికులను విచారించగా కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్లు స్థానికులు వెల్లడించారు. దీంతో ఆదిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న ధనరాజ్ ని పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. తల్లి చనిపోయి తండ్రి పారిపోవటంతో రెండున్నర ఏళ్ల చిన్నారి అనాధగా మిగిలిపోయింది. ఈ హత్య ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.