ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే యువతీ యువకులు ఆకర్షణకులోనై ప్రేమ పేరుతో మోసపోతున్నారు. ఈ క్రమంలో ఎంతోమంది తల్లిదండ్రులను ఎదిరించి ఇంటి నుండి పారిపోయి ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఇలా వివాహం చేసుకున్నవారు కలిసుందాం లేక కొంతకాలానికి విడిపోతున్నారు. కానీ వారి కొంతమంది తల్లిదండ్రుల ఒకరికొకరు దూరం అవుతున్నారు. ఇటీవల సికింద్రాబాద్లో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇద్దరి మైనర్ల ప్రేమ వివాహం విషాదంగా మిగిలింది.
వివరాలలోకి వెళితే… ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఇద్దరు మైనర్ యువతి యువకుల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలో వారు ఇంటి నుండి పారిపోయి రహస్యంగా వివాహం చేసుకున్నారు. వారి పిల్లల కనిపించకపోవడంతో తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలిసులు వారి కోసం గాలించి వారిని గుర్తించారు. ఈ క్రమంలో మైనర్లు అయిన ఇద్దరిని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి తల్లదండ్రులకు అప్పగించారు.
ఇలా తను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి నుండి తనని దూరం చేయటంతో యువతి తీవ్ర మనస్థాపానికి గురయ్యింది. ఈ క్రమంలో ఆగస్టు 15వ తేదీన ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత యువతి ఆత్మహత్య గురించి తెలుసుకున్న యువకుడు కూడా బుధవారం మౌలాలి వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తెలిసి తెలియని వయసులో పుట్టిన ప్రేమ వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణంతో ఇరు కుటుంబాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.