మంత్రగాడి మాటలు నమ్మి పిల్లల కోసం భార్యతో అస్తికలు తినిపించిన భర్త…. ఎక్కడంటే?

ప్రస్తుతం దేశం అభివృద్ధి పతంలో దూసుకుపోతోంది. అయినప్పటికీ కొంతమంది ప్రజలు మూఢనమ్మకాలువ పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మాంత్రికులను ఆశ్రయించి వారి సలహా మేరకు విచిత్రమైన పనులు చేస్తున్నారు. ఇటీవల పిల్లలు పుట్టలేదన్న కారణం వల్ల భర్త కుటుంబ సభ్యులు బలవంతంగా ఒక మహిళను స్మశానానికి తీసుకువెళ్లి అక్కడ మాంత్రికుడు చేత పూజలు జరిపించి స్మశానంలో ఉన్న అస్థికలను తినిపించిన ఘటన మహారాష్ట్రలో సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే…మహారాష్ట్రలో పుణె ధైరీ ప్రాంతంలోని సింహగడ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి 2019 లో వివాహం జరిగింది. అయితే పెళ్లి ఇంతకాలం గడిచినా కూడా వారికి పిల్లలు పుట్టకపోవడంతో అత్తింటి వారు ఆ మహిళను వేధింపులకు గురి చేయటం ప్రారంభించారు. ఇలా తరచూ ఆ మహిళను పిల్లల కోసం వేధించడమే కాకుండా ఆమె మీద దాడి కూడా చేసేవారు. భర్త కూడా తన భార్య పట్ల ఏమాత్రం కనికరం లేకుండా నిత్యం ఆమెను చిత్రహింసలకు గురి చేసేవాడు. పిల్లలు పుట్టలేదన్న కారణం వల్ల ఆమెను స్మశానానికి తీసుకువెళ్లి పూజలు చేయిస్తే పిల్లలు పుడతారని ఒక మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మారు.

దీంతో భర్త, అత్తింటి వారు ఆమెను బలవంతంగా స్మశానానికి తీసుకువెళ్లి శ్మశానంలో.. జంతు బలి, నర బలి ఇచ్చే మాంత్రికుడితో పూజలు చేయించి స్మశానం లో ఉన్న అస్థికలు, ఎముకలు తెచ్చి ఆ మహిళతో బలవంతంగా తినిపించారు. ఇలా ప్రతిరోజు అత్తింటి వారి వేధింపులు భరించలేక విసుగు చెందిన ఆ మహిళ ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. అత్తింటి వారు భర్త పిల్లల కోసం తనని వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టగా.. విస్తృత పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆ మహిళ చెప్పినట్లుగా.. భర్త, అత్తింటి సభ్యులు ఆమెకు నరకయాతన చూపించినట్లు తేలింది. దీంతో.. బాధిత మహిళ భర్తను, అత్తింటి సభ్యులను, మాంత్రికుడితో పాటు ఏకంగా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.