మావోయిస్టుల  కాల్పుల్లో ఎమ్మెల్యే మృతి, తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్

విశాఖ జిల్లాలో మావోల కాల్పులో ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోము మరణించిన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. మొహరం, వినాయక నిమజ్జన నేపథ్యంలో మిగిలిన ప్రాంతాలలో అల్లర్లు కాకుండా పోలీసులు హై అలర్ట్ అయ్యారు. వరంగల్ , ఆదిలాబాద్ అటవీ ప్రాంతాలలో పోలీసులు కూంబింగ్ కు బయలు దేరారు. విశాఖ ఏజెన్సీలలో పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. తెలుగు రాష్ట్రాల డిజిపిలు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజా ప్రతినిధుల ఇండ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

విశాఖ జిల్లాలో మావోయిస్టులు పంజా విసిరారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోము  పై మావోయిస్టులు కాల్పులు జరిపారు. డుంబ్రిగూడ మండలంలోని లిప్పిట్టిపుట్టు వద్ద మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. వీరు క్షేత్రస్థాయి పర్యటనలో ఉండగా మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారని, మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ ఘటనలో వీళ్లిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

కిడారి సర్వేశ్వరరావు

ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో యాభై మందికి పైగా మావోయిస్టులు పాల్గొన్నట్టు సమాచారంప్రశాంతంగా ఉన్న ఏపీలో ఒక్కసారిగా మావోయిస్టులు ఎమ్మెల్యే పై కాల్పులు జరపడంతో అంతా షాక్ కు గురయ్యారు. 2014 లో మొదటిసారి వైసీపి నుంచి కిడారి అరకు  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన టిడిపిలో చేరారు. గ్రామ దర్శిని కార్యక్రమంలో పాల్గొని వస్తుండగా మావోలు కాల్పులు జరిపారు.  సివేరి సోము 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. . ఆయనను ప్రభుత్వ విప్ గా నియమించింది. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సర్వేశ్వరరావు ఎమ్మెల్సీగా చేశారు. 

అరకు ఏజెన్సీలో మావోయిస్టుల కాల్పుల్లో కిడారి చనిపోవడంపై అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కిడారి, సోము చేసిన అభివృద్దిని కొనియాడారు. వారి మృతికి ఆయన సంతాపం తెలిపారు.  విషయం తెలుసుకున్న హోం మంత్రి చినరాజప్ప విశాఖ బయల్దేరారు.

ఆంధ్రలో ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే ని మావోయిస్టులు హత్య చేయడంతో  తెలంగాణలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల పర్యటనల వివరాలు పోలీసులకు తెలియచేయాలని కోరారు.  రాష్ట్రంలో మావోయిస్టు ప్రాభావిత ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఎజెన్సీ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులకు భద్రత పెంచతున్నట్లు పోలీసులు చెప్పారు.