కంకిపాడు పోలీస్ స్టేషన్లో రోజా మీద కేసు

తెలుగు దేశం పార్టీ మహిళలు వైసిపి ఫైర్ బ్రాండ్  నగరి ఎమ్మెల్యే  మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

ఇటీవల పెనమలూరు టిడిపి  శాసన సభ్యులు బోడే ప్రసాద్ ,  రోజా పరస్పరం దూషించుకున్న సంగతి తెలిసిందే.

అయతే, ఈ మాటల యుద్ధం లో రోజా  అనుచిత వ్యాఖ్యలు చేశారని టిడిపి వాళ్లు గోల గోల చేస్తున్నారు.

ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కాల్ మనీ, సెక్స్ రాకెట్ మాఫియా కు చెందిన వ్యక్తిని అటువంటి మనిషిని మరోసారి గెలవకుండా అడ్డుకోవాలని రోజా పిలుపునిచ్చారు. దీనికి ప్రతిగా రోజామాటలు ఎవరూ నమ్మరని,

తరువాత రోజా వ్యాఖ్యలకు  స్పందించిన బోడే ప్రసాద్ అలాగే విరుచుపడ్డారు. అయితే, రోజా  బ్రోతల్ హౌస్ నడపుతూ ఉందని తానంటే మాత్రం నమ్ముతారన టిడిపి ఎమ్మెల్యే బోడెప్రసాద్ అన్నారు. రోజా ఇలాంటి ప్రచారం మానుకొనకపోతే, రోజా మీద కోడిగుడ్డు చెప్పులు పడతాయని బోడె హెచ్చరించారరు.

ఈ గొడవ బాగా రచ్చ రచ్చ అయింది ఇపుడు పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించింది.

ఈ నేపథ్యంలో వైకాపా రాష్ట్రమహిళా  నాయకురాలు, నగిరి ఎమ్మెల్యే రోజా మీద చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళ ఆధ్వర్యంలో  కొంతమంది మహిళలు పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

రోజా తెదేపా నాయకులకు శాసన సభ్యులు బోడె ప్రసాద్ కు రోజా  క్షమాపణలు చెప్పాలని ఈ మహిళలు డిమాండ్‌ చేశారు.avja

కంకిపాడు పోలీస్ స్టేషన్లో తాము చేసిన  ఫిర్యాదు మేరకు రోజా మీద కఠిన చర్యలు తీసుకోవాలనివారు  డిమాండ్ చేశారు.