సొంత పార్టీ వాళ్లపై ఫైర్ అయిన ఎమ్మెల్యే రోజా.. దబిడి దిబిడే అంటూ?

వైసీపీ మంత్రి, ఎమ్మెల్యే అయిన రోజాకు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ప్రత్యర్థులపై ఘటుగా విమర్శలు చేయడం ద్వారా రోజా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. మంత్రి పదవి కోసం ఎన్నో గుళ్ల చుట్టూ తిరిగిన రోజా మంత్రి పదవి రావడంతో తనకు ఎంతో ఇష్టమైన టీవీ షోలకు సైతం గుడ్ బై చెప్పేశారు. అయితే ప్రస్తుతం రోజా సొంత పార్టీ కార్యకర్తలపై ఫైర్ కావడం ద్వారా వార్తల్లో నిలిచారు.

రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాగా తనకు కనీస సమాచారం ఇవ్వకుండా కొత్త క్వారీలకు శ్రీకారం చుట్టడంతో సొంత పార్టీ కార్యకర్తలపై ఆమె ఫైర్ అయ్యారు. ఈసలాపురం రెవెన్యూ గ్రామంలోని ప్రభుత్వ భూములలో పది ఎకరాలకు ఒక క్వారీ చొప్పున ఐదు క్వారీల ఏర్పాటుకు దరఖాస్తులు వెళ్లాయి. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక బలమైన నేత నుంచి అండదండలతో ఈ దరఖాస్తులు వెళ్లాయని బోగట్టా.

అయితే రోజాతో పాటు ఆమె వర్గీయులు మాత్రం కొత్త క్వారీల ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఉండటం గమనార్హం. రోజా క్వారీల విషయానికి సంబంధించి నేరుగా కలెక్టర్ వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడం గమనార్హం. క్వారీల ఏర్పాటు విషయంలో రూల్స్ ను పాటించడం లేదని రోజా అభిప్రాయం వ్యక్తం చేశారని సమాచారం అందుతోంది. మున్సిపాలిటీలో ఈసలాపురం గ్రామం ఉందని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు మున్సిపాలిటీలో ఉన్న గ్రామానికి సంబంధించి ఈసలాపురం పంచాయతీ కార్యదర్శికి లేఖ రాయడం ఏంటని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.

మంత్రి అయిన తర్వాత రోజా రాజకీయ కార్యక్రమాలకు మరింత సమయం కేటాయించడంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం మరింత ఎక్కువగా కృషి చేస్తున్నారు. రోజా 2024లో నగరి నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. రోజాను అభిమానించే అభిమానుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రోజాకు సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.