ప్రొద్దుటూర్ మునిసిపల్ మీటింగ్ లో టిడిడి సభ్యుల హెచ్చరిక

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ సాధారణ సమావేశం గోలగోల అయింది. ఇంత నిర్లక్ష్యమా మామీద అంటూ   టిడిపి కౌన్సిలర్లు మండిపడ్డారు.
తమ వార్డుల్లో టిడిపి కౌన్సిలర్లకు తెలియకుండా ప్రైవేటు వ్యక్తులతో పనులు చేపిస్తున్నారని టిడిపి కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనికి కారణమయిన అధికార్లను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుకు నిరసనగా మీటింగ్ హాల్లోనే టిడిపి కౌన్సిలర్లు బైఠాయింపు జరిపారు.అధికార పార్టీకి చెందిన టిడిపి కౌన్సిలర్లులో మొదట 12 వార్డ్ కు చెందిన విఎస్ ముక్తియర్ రాజీనామా పత్రాన్ని కమిషనర్ కు అందజేశారు త్వరలో ఇలాగే పనులు జరిగితే మొత్తం 22 మంది రాజీనామాకు సిద్ధం .