కబడ్డీ ఆడుతూ అక్కడే కుప్పకూలిపోయిన క్రీడాకారుడు..!

మృత్యువు ఏ రూపంలో ఎప్పుడు, ఎవరిని ఎలా కబలిస్తుందో ఎవరికి తెలియదు. కొన్ని సందర్భాలలో నిమిషాలలో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి . కొన్ని సందర్భాలలో క్రీడలు ఆడే సమయంలో ఎంతోమంది క్రీడాకారులు మైదానంలోనే ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా ఇటువంటి విషాద సంఘటన ఇటీవల తమిళనాడులో చోటు చేసుకుంది. కబడ్డీ ఆడుతూ ఒక క్రీడాకారుడు మైదానంలో స్పృహ తప్పి పడపోయి ప్రాణాలు కోల్పోయాడు.

వివరాలలోకి వెళితే… తమిళనాడులోని కడలూరు జిల్లా కడంపులియార్ పన్రుటి సమీపంలోని పెరియపురంగణి మురుగన్ టెంపుల్ వీధికి చెందిన విమల్‌రాజ్ కబడ్డీ ఆటగాడు. ప్రస్తుతం విమల్రాజ్ సేలం ప్రైవేట్ కాలేజీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతు సేలంలోని ఓ కబడ్డీ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి పన్రుటి పక్కన మనడికుప్పంలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ టోర్నీలో పాల్గొన్నాడు. మైదానంలో కబడ్డీ ఆట ఆడుతుండగా విమల్ రాజ్ ని ప్రత్యర్థి పట్టుకునేందుకు ప్రయత్నించగా అతని ఛాతీపై బలంగా దెబ్బ తగిలి, అపస్మారక స్థితికి చేరుకున్నాడు.

దీంతో అక్కడున్న క్రీడాకారులతో పాటు ప్రేక్షకులు కూడా వెంటనే స్పందించి విమల్ రాజ్ ని దగ్గర్లోని పన్రుటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అక్కడ మిమ్మల్ని రాజ్ ని పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. విమల్ రాజ్ మరణంతో ఈ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న ముత్తండికుప్పం పోలీసులు ఆస్పత్రికి చేరుకొని అక్కడ విమల్ రాజ్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ముండియంబాక్కంకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విమల్ రాజ్ ఇలా మరణించడంతో అతని కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది.