సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు కారు యాక్సిడెంట్

సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు కారు భీభత్సాన్ని సృష్టించింది. సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ దగ్గర సురేష్ బాబు కారు అదుపు తప్పి బైక్ పై వెళుతున్న దంపతులను ఢికొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు చిన్నారికి గాయాలయ్యాయి.

సురేష్ బాబు కారులో వెళుతండగా రాంగ్ రూట్ లో ఓ బైక్ సడన్ గా దూసుకు వచ్చింది. దీంతో కారు అదుపు చేసేలోగా బైక్ వచ్చి కారును ఢికొట్టడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన దంపతులతోపాటు చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం పై కేసు నమోదు చేసుకున్న కార్ఖానా పోలీసులు ప్రమాదానికి కారణమైన సురేష్ బాబుకు పోలీసలు 41 ఏ నోటిసులు అందజేశారు.