వేములవాడలో యువజంట ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల వేములవాడ పట్టణంలో విషాదం జరిగింది. వేములవాడలోని ఓ లాడ్జీలో పురుగుల మందు తాగి ఓ యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఆదిలాబాద్ జిల్లా అకినేపల్లి మండలం లింగాపూర్ కు చెందిన సింగతి విష్ణు వర్దన్, అతని ప్రియురాలు గా పోలీసులు గుర్తించారు.

వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వీరిద్దరు వచ్చినట్టు తెలుస్తోంది. పురుగుల మందు తాగి ఉదయం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరు ప్రేమించుకుంటే పెద్దలు ఒప్పుకోకపోవడంతోనే ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. జంట ఆత్మహత్య పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.