తల్లి మీద కన్నేస్తే తల నరికి తీసుకుని స్టేషన్ కు పోయాడు (వీడియో)

కర్ణాటకలో దారుణం జరిగింది. తన తల్లి మీద ఒక వ్యక్తి కన్నేశాడని, తల్లి మీద అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని ఆగ్రహంతో ఆ వ్యక్తి తల నరికాడు. అంతేకాదు ఆ తల తీసుకుని నేరుగా పోలీసు స్టేషన్ వెళ్లి లొంగి పోయాడు. ఒల్లు గగుర్పొడిచే ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ యువకుడి పేరు పశుపతి. తల్లి మీద పరాయోడు అత్యాచారయత్నానికి‌ పాల్పడందుకు అతడి తల నరికిండు. కర్ణాటకలోని మాన్డియా జిల్లా మల్లవల్లి గ్రామం లో ఈ సంఘటన జరిగింది. 

తన తల్లి పై అత్యాచార యత్నానికి పాల్పడ్డ గిరీష్ అనే వ్యక్తిని తల నరికి పోలీస్ స్టేషన్ కు తెచ్చి లొంగిపోయిన నిందితుడు పశుపతి. మొండి తలతో పశుపతి రోడ్ల పై తిరుగుతుంటే భయబ్రాంతులకు  గురయ్యారు స్థానికులు.

నెల రోజుల వ్యవధిలో కర్ణాటక లో మూడోసారి ఇదే తరహా హత్య ఘటన జరగడం షాక్ కు గురి చేస్తున్నది. పశుపతి వీడియో కింద ఉంది చూడండి.