అన్నదమ్ములను కాటేసిన పాము, పరిస్థితివిషమం

కృష్ణాజిల్లా గన్నవరం మండలం చిక్కవరం గ్రామానికి చెందిన ఓ ఇంట్లోకి పాము చొరబడింది. ఆ సమయంలో కుటుంబసభ్యులంతా నిద్రలో ఉన్నారు. నిద్రిస్తున్న ఇద్దరు అన్నదమ్ములు మాదాసు దానియోలు, మాదాసు శ్రీనులను పాము కాటేసింది. ఏదో కుట్టినట్టుగా అనిపించడంతో వారిద్దరు ఉలిక్కి పడి లేచారు. అక్కడ వారికి పాము కనిపించింది. దీనింతో భయంతో గట్టిగా అరిచారు. కుటుంబ సభ్యులు లేచారు. పాము కాటుకు గురైనదానియోలు, శ్రీనును వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు బిడ్డలు పాము కాటుకు గురవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.ఈ మధ్య కోస్తాలో పాముల బెడద తీవ్రమయింది. అనేక మంది పాము కాటుకు గురై మరణించారు. గన్నవరంలోనే గత నెలలో ముగ్గురు పాముకాటుకు గురై మరణించారు.