ఆమెను చంపి ముక్కలు చేసినందుకు బాధపడలేదు.. శ్రద్ధా వాకర్ హత్య కేసులో బయటపడిన నిజాలు!

శ్రద్ధ వాకర్ హత్య కేసులో రోజురోజుకు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసినటువంటి అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు మంగళవారం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. ఈ విచారణలో భాగంగా ఈయన శ్రద్ధ వాకర్ హత్య గురించి మాట్లాడుతూ ఆమెను తానే చంపానని ఒప్పుకున్నారు. ఇలా తనని చంపిన అనంతరం తన శవాన్ని ముక్కలు ముక్కలు చేసి అడవిలో పారేసినట్లు వెల్లడించారు. ఈ విధంగా తనని చంపినందుకు నేను ఏమాత్రం బాధపడడం లేదంటూ ఈ విచారణలో ఆఫ్తాబ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే తాను కేవలం శ్రద్ధ వాకర్ తో మాత్రమే కాకుండా చాలామంది అమ్మాయిలతో డేటింగ్ లో పాల్గొన్నాను అని తెలిపారు. ఈ విధంగా ఆఫ్తాబ్ నుఫోరెన్సిక్ అధికారులు ప్రశ్నిస్తున్న సమయంలో ఆయన సాధారణ స్థితిలోనే ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే ఈయనని ఈ విచారణకు హాజరయ్యే ముందు కొందరు తనపై కత్తులతో దాడి చేసి చంపాలనే ప్రయత్నం చేశారు.ఇలా ఈయనపై హత్యాయత్నం జరుగుతుండగా అధికారులు పటిష్ట భద్రత చర్యలతో ఆయనని పాలిగ్రాఫ్ టెస్టుకు తీసుకువెళ్లారు.

ఇక ఈ ఘటన మే నెలలో జరగగా తాజాగా ఈ విషయం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రద్ధ వాకర్ ను చంపి ఆమెను ముక్కలు ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచిపెట్టడమే కాకుండా మరికొన్ని ముక్కలను అడవిలో విసిరినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈ కేసులో భాగంగా పోలీసులు నవంబర్ 12వ తేదీ ఆఫ్తాబ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే ఈయనకు కోర్టు కస్టడీ విధించడమే కాకుండా నేడు డిసెంబర్ 1 వ తేదీ నార్కో టెస్టులను చేయించడానికి కూడా అనుమతి తెలిపింది.