హరికృష్ణ డెడ్ బాడీతో సెల్పీ : ఇదేమి పిచ్చిరా బాబూ

సెల్ఫీ పిచ్చి ఎంతలా పెరుగుతుందంటే… అది ప్రమాదానికి గురై ప్రాణాలు తీస్తున్నా కూడా మనుషులలో మార్పు రావడం లేదు. ఫోటోలు తీసుకొని వాట్సాప్, ఫేస్ బుక్ లలో పెట్టుకొని లైక్ లు, షేర్లు చూసుకొని మురిసి పోతున్నారు. ఎదురుగా మనిషి చచ్చిపోతున్నా దానిని వీడియో తీసి మురిసి పోతున్నారు తప్పా ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేయడం లేదు. మనిషి చచ్చినా దానిని ఫోటో తీసుకొని కొందరు మురిసి పోతున్నారు. సెల్ఫీల పిచ్చితో జనాలు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు.  కామినేని హాస్పిటల్ సిబ్బంది హరికృష్ణ మృతదేహం వద్ద సెల్పీలు తీసుకున్న ఫోటో కింద ఉంది చూడండి.

మృతదేహంతో సెల్ఫీలు దిగుతున్న సిబ్బంది

హరికృష్ణ ప్రమాదానికి గురై నార్కట్ పల్లి కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే హరికృష్ణకు ఐసీయూలో చికిత్సనందించిన సిబ్బంది హరికృష్ణ మృతదేహంతో సెల్పీలు దిగారు. సెల్ఫీలు దిగితే దిగారు కానీ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో  ఇప్పుడా ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఒక నేత చనిపోయి అంతా విషాదంలో ఉంటే మృతదేహంతో సెల్ఫీలు దిగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హరికృష్ణ ప్రమాద వార్త తెలుసుకొని ఆసుపత్రికి వచ్చిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు విషాదంలో ఉంటే అభిమానులు వారి వెంట నడుస్తూ సెల్ఫీలు తీసుకున్నారు. సమయం సంధర్బం లేకుండా పరిస్థితిని అర్ధం చేసుకోకుండా సెల్పీలు తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.