మాజీ సీఎస్ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుంప్రీoకెళ్లిన జగన్ సర్కార్ కు అక్కడా ఆశించిన ఫలితం దక్కలేదు. ఇప్పటికే రెండు, మూడు సార్లు విచారణ జరిగి వాయిదా పడింది. అయితే నిమ్మగడ్డతో ఇప్పుడు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, అదే పార్టీ నేత కామినేని శ్రీనివాసరావులు రసహ్యంగా భేటీ అయినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 13న ముగ్గురు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఎనిమిదవ అంతస్తులో భేటి అయ్యారు. దాదాపు గంటకు పై గా ముగ్గురి మధ్య బేటి జరిగినట్లు తెలుస్తోంది.
ఈనెల 13న ఉదయం 10 గంటలకు సుజనా, 11.23 నిమిషాలకు కామినేని, చివర్లో నిమ్మగడ్డ హోటల్ లోకి ఎంటరైన సీసీ పుటేజీ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతోనే విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ముగ్గురు ఒకే లిప్టులో ఎనిమిదవ అంతస్తుకు చేరుకోలేదు. వేర్వేరు లిప్టుల ద్వారా పై అంతస్తుకు చేరుకున్నారు. కానీ ఈ ముగ్గురిని రిసీవ్ చేసుకున్న వ్యక్తి మాత్రం ఒకరే కావడం విశేషం. ఈ ముగ్గురు ఒకే సారి రావడం..ఒకే వ్యక్తి రిసీవ్ చేసుకోవడంతో ఇది రాజకీయ భేటీ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ముగ్గురులో నిమ్మగడ్డ ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికల కమీషనర్ ..మిగిలిన ఇద్దరు పక్కా రాజకీయ నాయకులు కావడంతో ఈ భేటి పై ఆసక్తి నెలకొంది.
పైగా నిమ్మగడ్డ వ్యవహారం రాజకీయ నాయకులు, హైకోర్టు దాటి సుప్రీం కోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో ఎందకు కలిసారు? అన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. మరి ఇది స్నేహ పూర్వక భేటా? పొలిటికల్ భేటా? అన్నది తేలాల్సి ఉంది. ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డను తప్పిస్తు జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించడం, అక్కడ తీర్పు నిమ్మగడ్డకు అనుకూలంగా రావడంతో ప్రభుత్వం ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకు వెళ్లిన సంగతి తెలిసిందే.