Crime News:ప్రస్తుత కాలంలో చాలా మంది ఏవిధమైన కష్టం చేయకుండా సులువుగా డబ్బు సంపాదించడం కోసం అడ్డ దారులు తొక్కుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో రాజకీయ నాయకులు ఓట్ల కోసం జనాలకి పని చేసే అవసరం లేకుండా అనేక రకాల పథకాల పేరిట డబ్బు అందచేయటం వల్ల జనాలు కొందరు పని చేయటానికి ఆసక్తి చూపటం లేదు. ఇలా సులువుగా డబ్బు సంపాదించటానికి అనేక విధాలుగా స్కాం లు చేస్తున్నారు. ఇటివల ఇద్దరు యువకుల డబ్బు కోసం నకిలీ బస్ పాస్ లు అమ్ముతూ పట్టుబడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ కు చెందిన బోయిని కనకయ్య, సంజీవ్ అనే ఇద్దరు వ్యక్తులు నకిలీ పాసులు తయారు చేస్తు అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు. ఈ తరుణంలో జనవరి 3 వ తేదీన సిద్ధిపేట ఆర్టీసీ డిపో పరిధిలో నకిలీ బస్ పాసులు చలామణిలో ఉన్నాయంటూ ఆర్టీసీ అధికారులు హుస్నాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటన గురించి పోలీసులు విచారణ జరిపినా కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.
అందువల్ల ఈ కేసును పోలీసులు చాలెంజింగ్ గా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో బోయిని కనకయ్య, సంజీవ్ నకిలీ బస్ పాస్ లు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కనకయ్య దివ్యంగుడు అవటం వల్ల తనకి ఉన్న సదరం సర్టిఫికేట్ ఉపయోగించి.. తన బస్ పాస్ పోయిందంటూ వేరువేరు బస్ డిపోలో బస్ పాస్ లు తీసుకునేవాడు. వాటిని సంజీవ్ కి అందించగా కంప్యూటర్ ద్వారా నకిలీ బస్ పాస్ లు తయారు చేసేవాడు.ఈ మేరకు పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న కంప్యూటర్ స్వాధీనం చేసుకొని , వారిని రిమాండ్ కి తరలించారు.