ఆర్టీసి క్రాస్ రోడ్డులోని బావర్చి హోటల్ సీజ్

ఆర్టీసి క్రాస్ రోడ్డులోని బావర్చి హోటల్ ను జీహెచ్ ఎంసీ అధికారులు సీజ్ చేశారు. బల్క్ గ్యారేజ్ ఏర్పాటు చేసుకోవాలని హోటల్ నిర్వాహకులకు నవంబర్ 25న నోటిసులు నోటిసులు ఇచ్చామని అయినా నిర్వాహకులు ఇంత వరకు స్పందింలేదని అందుకే చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. అయితే హోటల్ ను సీజ్ చేయవద్దంటూ హోటల్ నిర్వాహకులు జిహెచ్ ఎంసీ అధికారులతో వాగ్వాదానికి దిగారు.

ఆర్టీసి క్రాస్ రోడ్డులోని బావార్చి చాలా ఫేమస్. ఈ హోటల్ లోని బిర్యానీ చాలా బాగుంటుందని నిత్యం వేలాది మంది వస్తారు. హైదరాబాద్ లోని బావర్చి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆర్టీసి క్రాస్ రోడ్డులోని బావర్చి. అటువంటి బావర్చి సీజ్ కావడంతో బిర్యానీ ప్రియులు నిరాశకు గురవుతున్నారు.