మేడ్చల్ జిల్లా పరిధిలోని షామీర్ పేటలో రేవ్ పార్టీని శుక్రవారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
బాలానగర్ ఎస్ఓటి బృందం ఆధ్వర్యంలో షామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెలబ్రెటీ రిసార్ట్స్ లో దాడులు చేశారు. అక్కడ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నరన్న పక్కా సమాచారంతో ఈ దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఏడుగురు వ్యక్తులు, నలుగురు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. వారిని షామీర్ పేట్ పోలీసులకు అప్పగించారు.
పట్టుబడ్డ వ్యక్తులలో
1,ఓడెం చంద్ర రెడ్డి
2,నాగం మునయ్యా
3,దోంతుల రాజ్ కుమార్
4,మెరుగు సత్యనారాయణ
5,కొలిచెలిమి మహిపాల్
6,నందికొండ శ్రీనివాస్
7 అలిశాల లింగం
పోలీసులకు పట్టుబడ్డ వ్యక్తులు అందరూ గజ్వేల్ ప్రాంతానికి చెందివారుగా చెబుతున్నారు. వీరిలో కొందరు డాక్టర్లు కూడా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో పట్టుబడిన అమ్మాయిలను రెస్క్యూ హోం కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వీడియోలు కింద ఉన్నాయి.