టిఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గ అభ్యర్థి భూపాల్ రెడ్డి నోటికి పనిచెప్పారు. ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక గ్రామంలో పర్యటించి ప్రసంగిస్తున్నారు. గూడేలకు, ఎస్సీలకు, ఎస్టీలకు టిఆర్ఎస్ పార్టీ ఎంతో మేలు చేసిందని మాట్లాడుతున్నాడు.
ఇంతలో ఆయన మాటలకు ఒక యువకుడు అడ్డు తగిలాడు. మాకేమీ టిఆర్ఎస్ పథకాలు రావడంలేదని ప్రశ్నించాడు ఆ యువకుడు. దీంతో ఎక్కడ లేని ఆగ్రహంతో ఊగిపోయాడు ఆ తాజా మాజీ ఎమ్మెల్యే. వెంటనే కోపం తట్టుకోలేక నోటికి పని చెప్పాడు. బూతు కూత కూయనే కూశాడు.
టిఆర్ఎస్ అభ్యర్థి నోటినుంచి బూతు కూత రావడంతో గ్రామంలోని యువకులంతా ఆయనపై ఎగబడ్డారు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఎదురు తిరిగారు. వెంటనే గ్రామస్తులంతా ఏకమై ఊరి పొలిమేరలు దాటించారు.
ఎమ్మెల్యే ప్రసంగంలో ఏమన్నాడో కింద వీడియోలో ఉంది చూడండి.