భార్యాభర్తలు సెక్స్ చేసేందుకు అనేక భంగిమలు ఉన్నాయి. అందుకే శృంగారంలో పాల్గొనేటప్పుడు దంపతులు సిగ్గు పడకూడదంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనదైన శృంగారం.. మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. భర్యాభర్తలను మరింత దగ్గర చేస్తుంది. అయితే.. శృంగారంలో పాల్గొనే సమయంలో కొన్న పద్ధతులను కొన్ని సమయాల్లో చేయకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. అందులో ముఖ్యమైంది షవర్ సెక్స్. ఇందుకు కారణాలేంటో తెలుసుకుందాం.
షవర్ చేసేటప్పుడు నేల తడిగా ఉంటుంది. బ్యాలెన్స్ తప్పితే జారి పడే ప్రమాదం ఉంది. ఇష్టమైన శృంగార భంగిమలు కూడా కష్టమే. తడి వల్ల ఏమైనా దెబ్బలు తగిలేందుకు అవకాశముంది. ఇద్దరి ఎత్తులో వ్యత్యాసం కూడా ఇబ్బంది అవుతుంది. నీళ్లు పడుతూండగా శృంగార భంగిమలు, ముద్దులు పెట్టుకోవడం కూడా కష్టమవుతుంది. భాగస్వామిని పైకి ఎత్తుకోవచ్చనే ఆలోచన కూడా ఆచరణలో కష్టం అవుతుంది. నీళ్ల వల్ల ఆయాసం వచ్చి ఎక్కువసేపు ఉండలేరు. స్నానం చేసే సమయంలో శృంగారంలో పాల్గొంటే ప్రైవైటు భాగాలు పొడిబారే అవకాశం ఉంది.
ఓరల్ సెక్స్ కోసం సిద్ధపడినా భాగస్వామి నుంచి సపోర్ట్ లభించడం కష్టం. ముఖంపై నీటి తుంపర్లు పడుతూండగా ఫ్లోర్ పై మోకాళ్లపై కూర్చోవాలన్నా నొప్పితో కష్టమే. ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. సబ్బుతో ఒంటిని రుద్దుకోవడం సెక్సీగా అనిపించినా శృంగారం చేసే సమయంలో ఇబ్బంది ఉంటుంది. మానసికంగా భాగస్వామి సిద్ధంగా లేకపోవడం.. మీరు మనసు పెట్టలేకపోవడం జరుగుతుంది. ఇక షవర్ గానీ.. వాష్ రూమ్ గానీ అధునాతనంగా లేకపోతే బాత్ రూమ్ శృంగారం ఇబ్బందిగానే ఉంటుంది.
ఇద్దరికీ షవర్ శృంగారం ఇష్టమైనా అక్కడి పరిస్థితి అంత అనుకూలించకపోవచ్చు. ఒకరు ఫోర్స్ గా ఉన్నా మరొకరు సంసిద్ధం కాకపోవచ్చు. బాత్ రూమ్ పరిస్థితి, సైజ్ ని బట్టి ఇద్దరూ ఇబ్బందిపడొచ్చు. ఇష్టమైన భంగిమలకు అనుకూలం కాకపోవచ్చు. ఇద్దరికీ ఇష్టమైనా ఒక్కరే మానసికంగా సిద్ధంగా ఉండి మరొకరు సిద్ధంగా లేకపోతే శృంగారం విషయంలో ఇద్దరూ గందరగోళానికి గురవుతారు. అందుకే షవర్ కింద శృంగారం చేసే క్రమంలో కొంత ఆలోచించాల్సిందే!