తుఫాన్ హెచ్చ‌రిక, తీరం వైపు దూసుకొస్తున్న పెథాయ్

ఈ రోజు మ‌ధ్యాహ్నం 12.00 నుంచి సాయంత్రం 4.30 గంట‌ల‌లోపు  పెథాయ్  తీరం తాకుతుందని ఆంధ్రప్రదేశ్ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ప్రకటించింది,
* కొద్ది గంట‌లలోపు తూర్పు గోదావ‌రి జిల్లాల్లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు, ఈదురుగాలులు మొదలవుతాయి.
రాజోలు, స‌ఖినేటిప‌ల్లి, అమ‌లాపురం, మ‌లికిపురం, అంబాజీపేట‌, మామిడికుదురు, అల్ల‌వ‌రం, ఖాట్రేనికోన, ఉప్ప‌ల‌గుప్తం మండ‌లాల్లో మ‌రో గంట‌లో కుండ‌పోత వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయి.
ఈ ప్రాంత ప్ర‌జ‌లు  జాగ్ర‌త్త‌గా ఉండాలని ఈకేంద్రం హెచ్చరించింది.
*యానాం-తుని మ‌ధ్య తీరం  తుపాన్‌ తీరం తాకనుందని కూడా ఈ కేంద్రం పేర్కొంది. ఇపుడు 
కాకినాడ‌కు వంద కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉంది ఫెథాన్. 

పెథాయ్ వార్నింగ్ హైలైట్స్

*కాకినాడ‌కు 125 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మైన తీవ్ర తుఫాన్ 

*తుఫాన్  తూర్పుగోదావ‌రి జిల్లావైపు వేగంగా క‌దులుతోంది
*గంట‌కు 16 కిలోమీట‌ర్ల వేగంతో క‌దులుతున్న తుపాన్‌
*ఈరోజు ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల లోపు తీరం దాతనున్నతుఫాన్ .
*యానాం నుంచి తుని మధ్య తీరం దాటనున్న తుపాను
*గంట‌కు 100 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన ఈదుడు గాలుల‌తో తీరం దాట‌నున్న పెథాయ్‌
*తూర్పుగోదారి, పచ్చిమ గోదావరి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయి
*తూర్పు గోదావరి, పచ్చిమ గోదావరి జిల్లాల్లో బ‌ల‌మైన ఈదురు గాలులు గంట‌కు 110 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో వీస్తాయి
*విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో గంట‌కు 80 నుంచి 90 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయి
*తీరం దాటే స‌మ‌యంలో పెనుగాలుల‌తో కూడిన వ‌ర్షం విరుచుకుపడుతుంది
*ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాలి
*అర‌టి రైతులు, ఉద్యానవ‌న రైతులు జాగ్ర‌త్త‌ల్లో ఉండాలి.వ‌రి, జొన్న‌, త‌దిత‌ర ధాన్యాల‌ను కోసిన‌వారు వాటిని త‌క్ష‌ణం గోదాముల్లో భ‌ద్ర‌ప‌రచాలి. పొలాల్లోనే ఇంకా ధాన్యం ఉంటే దానిపైన టార్పాలిన్ ప‌ట్ట‌లు క‌ప్పి భ‌ధ్ర‌ప‌ర‌చాలి.వ్య‌వ‌సాయ శాఖ  అధికారుల నుంచి రైతులు ఇవి పొంద‌వ‌చ్చు.గుడిసెల్లో, రేకుల షెడ్డుల్లో ఉన్న నివాస‌ముంటున్న వారిని వెంట‌నే పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించాలి
లోత‌ట్టు ప్రాంత ప్ర‌జ‌ల‌ను త‌క్ష‌ణం సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాలి.తుపాన్ తీరం దాటే వ‌ర‌కు ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకూడ‌దు. రోడ్ల‌పై వాహ‌నాల్లో తిర‌గ‌రాదు, చెట్ల కింద త‌ల‌దాచుకోరాదు.
తూర్పు గోదావ‌రి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం ప్ర‌జ‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌గా ఉండాలి

పెథాయ్ తుఫాను కారణంగా పలు రైళ్ల రద్దు

రత్నాచల్‌, జన్మభూమి, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేశారు.

అలాగే మెమూ ప్యాసింజర్లు… విజయవాడ- రాజమండ్రి, రాజమండ్రి- విశాఖ ప్యాసింజర్లు, విశాఖ- కాకినాడ పోర్టు, కాకినాడ పోర్టు-విజయవాడ, విజయవాడ- తెనాలి, తెనాలి- గుంటూరు ప్యాసింజర్లను రద్దు చేశారు. డెమూ ప్యాసింజర్లు…. రాజమండ్రి- భీమవరం, భీమవరం- నిడదవోలు, భీమవరం- విజయవాడ డెమూ ప్యాసింజర్‌, రాజమండ్రి- నరసాపురం, నరసాపురం- గుంటూరు, గుంటూరు- విజయవాడ, విజయవాడ- మచిలీపట్నం రైళ్లు రద్దు అయ్యాయి.

పెథాయ్ తుఫాను ప్రభావం విమానాల  రాకపోకలపై పడింది

తుఫాను కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి…..

వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ- విశాఖ ఇండిగో విమానం హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యింది…..

అలాగే చెన్నై- విశాఖ విమానం తిరిగి చెన్నైకి పయనమైంది…..

అటు హైదరాబాద్- విశాఖ స్పైస్ జెట్ విమానం రద్దు…..

విశాఖ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దాదాపు 14 విమానాలు రద్దు

దీంతో విశాఖ ఎయిర్‌పోర్టులో సుమారు 700 మంది ప్రయాణికులు పడిగాపులు.