ఫ్లాష్..ఫ్లాష్.. హైదరాబాద్‌లో మరో ప్రేమ కథ విషాదం (వీడియో)

హైదరాబాద్ లో మరో ప్రేమ కథ విషాదాంతం అయ్యింది. సంతోష్ నగర్ లో తన భార్యను మామ తీసుకెళ్లడంతో మనస్తాపానికి గురైన శ్రీకాంత్ అనే యువకుడు కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం చనిపోయాడు. పూర్తి వివరాలు ఏంటంటే…

నల్లగొండ జిల్లా నకిరేకల్ కు చెందిన గడగోజు శ్రీహర్ష,   చిట్టిపాక శ్రీకాంత్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు చిన్నప్పటి నుంచే ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో ఉంటున్నారు. అప్పటి నుంచి అమ్మాయి తరపు బంధువులు, తల్లిదండ్రులు వీరిని బెదిరిస్తూనే ఉన్నారు. సంతోష్ నగర్ లోనే వీరు కాపురం పెట్టారు. నిత్యం పంచాయతీలు జరిగేవని తెలుస్తోంది. కొద్ది కాలం క్రితం అమ్మాయి గర్బం దాల్చగా అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి బలవంతంగా తీసుకెళ్లి అమ్మాయికి అబార్షన్ చేయించారని శ్రీకాంత్ తెలిపారు. అప్పటి నుంచి తన భార్యను తన దగ్గరకు రాకుండా చేసి వేధిస్తున్నారన్నాడు. 

తనను అత్తమ్మ, మామ, బంధువులు చాలా హింసించారని శ్రీకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. వారి స్వంత ఊరు నకిరేకల్ కావడంతో అక్కడి పెద్ద మనుషులతో కూడా మాట్లాడాను. ఎమ్మెల్యే వీరేషం అన్న దగ్గరికి కూడా పోయినా, పుష్పక్క దగ్గరికి కూడా పోయినా. వాడు మంచోడు కాదు వారిని ఎందుకు చేసుకున్నావురా అని వారే నన్ను ప్రశ్నించారు. అంతటి మూర్ఖుడు తమ మామ అని తెలిపాడు. ఆత్మహత్య చేసుకునే ముందు శ్రీకాంత్ వీడియో తీసుకున్నాడు. శ్రీకాంత్ వీడియో కింద ఉంది చూడండి.  ఈ లింక్ పై క్లిక్ చేయండి వీడియో ప్లే అవుతుంది.

 

 

 

https://www.youtube.com/watch?v=izRfdVciOsY&feature=youtu.be

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దూరమవ్వడంతో శ్రీకాంత్ భరించలేక పోయాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీకాంత్ గురువారం ఉదయం సంతోష్ నగర్ లో కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. 80 శాతం కాలిన గాయాలతో ఉన్న శ్రీకాంత్ ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్ప పొందుతూ మరణించాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులపై , అతని పై అక్రమ కేసులు పెట్టి వేధించాడని బంధువులు తెలిపారు. శ్రీకాంత్ దళితుడు కావడంతోనే అతడు కక్ష్య గట్టి చివరకు ప్రాణాలు తీసుకునేలా చేశాడని వారు ఆరోపించారు.

శ్రీహర్ష