రైలు ఢీకొని మృతి చెందిన బీఎస్ ఎఫ్ జవాన్… వైరల్ అవుతున్న వీడియో?

సాధారణంగా మనం రైల్వే స్టేషన్ కి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున రైల్వే అధికారులు ప్రయాణికులకు ఎన్నో సూచనలు చేస్తూ ఉంటారు.రైలు ఆగిన తర్వాతే దిగాలని ఎవరు తొందరపడకూడదని అలాగే రైల్వే పట్టాల పై ఫ్లాట్ ఫామ్ దాటే ప్రయత్నం చేయకూడదు అంటూ పెద్ద ఎత్తున సూచనలు చేస్తూ ఉంటారు.అయితే చాలామంది వారి మాటలను పెడ చెవిన పెట్టి సాహసాలు చేస్తూ ఎన్నోసార్లు ఎంతోమంది మృత్యువడిలోకి చేరిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి హర్యానాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలలోకి వెళితే..

హర్యానా మహేంద్రగఢ్ జిల్లా మజ్రా ఖుర్ద్ గ్రామం పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మరణించిన వ్యక్తి బీఎస్‌ఎఫ్ జవాన్ వీర్ సింగ్‌గా గుర్తించారు. ఇకపోతే ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజ్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా వీర్ సింగ్ రైలు దగ్గరకు వచ్చిన క్రమంలో అతను రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నం చేశాడు.ఈ ప్రయత్నంలో భాగంగా అతనిని రైలు ఢీ కొట్టి వెళ్లిపోవడంతో ఆయన ఎగిరి చాలా దూరం పడ్డారు. అయితే ఆయన తలకు పెద్ద ఎత్తున గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వెంటనే రైల్వే పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ క్రమంలోనే ఆయన జవాన్ వీర్ సింగ్ గా గుర్తించారు. అయితే ఈయన రైలు వేగాన్ని అంచనా వేయకుండా పట్టాలు దాటేందుకు ప్రయత్నం చేస్తుండగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఇకపోతే ఈయన విధులు నిమిత్తం సెలవులు ఉండటంతో తన సొంత గ్రామానికి వచ్చారు. అయితే అదే జిల్లాలో మజ్రా ఖుర్ద్ గ్రామంలో తన సోదరిని చూడటానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు.