ఇటీవలి కాలంలో వరుస ఆత్మహత్యలు జరుగుతుండడం కలవరపరుస్తుంది. కొద్దిగా డిప్రెషన్‌కు లోనైన లేదంటే డబ్బు సమస్య ఉన్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చిన ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సమస్యను తోటి మిత్రులతోనో లేదంటే బంధువులతోనో కలిసి సాల్వ్ చేసుకోవాలే తప్ప ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అని ఎంత హెచ్చరించిన కూడా ఆత్మహత్యలకే పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఘటన అందరిని షాక్‌కు గురి చేసింది
కర్నూల్ జిల్లలాలోని నంద్యాలకు చెందిన శివుడు అనే వ్యక్తి పొట్ట కూటి కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. మారుతి ప్లాజా కంప్లెక్ 5వ అంతస్తులో ఉన్న కేబుల్ ఛానల్ జై కిషన్ న్యూస్ ఛానల్ లో కొన్నాళ్లుగా ఎడటిర్గా పని చేస్తున్నాడు. అయితే ఈ రోజు శివుడు ఐదవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సైఫాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరకొని కేసు నమోదు చేసుకున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు.
శివుడు ఆత్మహత్యకు కారణాలేంటనేవి తెలియరాలేదు. పోలీసులు దీనిపై లోతుగా విచారిస్తున్న నేపథ్యంలో అతి త్వరలోనే మృతికి సంబంధించిన కారణాలను బయటకు రానున్నాయి. అయితే ఈ కేసులో భాగంగా పోలీసులు శివ పనిచేస్తున్న ఆఫీసు ఉద్యోగులతో పాటు.. స్నేహితులు, కుటుంబ సభ్యుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే శివ ఎందుకు ఇలా చేసుకున్నాడో మాకు తెలియదంటూ స్నేహితులు చెబుతున్నారు. అనుమానస్పద కేసేగా నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.