ప్రణయ్ మర్డర్ కేసులో టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హస్తం

సంచలనం రేపిన మిర్యాలగూడ యువకుడు ప్రణయ్ హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పక్కా ప్లాన్ ప్రకారమే ఈ మర్డర్ జరిగిందని తేలిపోయింది. అమృత తండ్రి పలుకుబడి కలిగిన వ్యక్తి కావడం, కోటీశ్వరుడైన వ్యాపారి కావడంతో ఈ హత్య కేసులో చాలా మంది ఇన్వాల్వ్ అయినట్లు తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో నిత్యం వివాదాల్లో నిలిచే నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని ప్రణయ్ భార్య అమృత ఆరోపిస్తోంది. 

అంతేకాకుండా ఆపద్ధర్మ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కి కూడా మారుతీరావు, ఆయన సోదరుడు అత్యంత దగ్గరివారే అన్నట్లు ప్రచారం సాగుతోంది. జగదీష్ రెడ్డి జన్మదినం సందర్భంగా భారీ ఫ్లెక్సీలు కూడా మారుతీరావు ఏర్పాటు చేసిన ఫొటో, వేదిక పంచుకున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫొటోలు కింద ఉన్నాయి చూడండి.

ఆపద్ధర్మ మంత్రి జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న మారుతీరావు (వైరల్ ఫొటో)
జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు

 

ఇదిలా ఉంటే ప్రణయ్ భార్య అమృత ఒక తెలుగు న్యూస్ ఛానెల్ కు (మహా టివి) ఇచ్చిన ఇంటర్వ్యూలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం హస్తం కూడా ఉందని చాలా క్లియర్ గా చెప్పింది. ఇంటర్వ్యూలో అమృత ఏమి మాట్లాడారో చదవండి.

నాకు తెలిసినంత వరకు నకిరేకల్ ఎమ్మెల్యే  ఒకసారి మమ్మల్ని రమ్మని పిలిచారు. నేను, ప్రణయ్ వెళ్లేందుకు భయపడ్డాము. ఎందుకంటే అంతకుముందు రోజే నల్లగొండలో బొడ్డుపల్లి శ్రీనివాస్ మర్డర్ జరిగింది. ఆ హత్యలో నకిరేకల్ ఎమ్మెల్యే హస్తం ఉందని ప్రచారం అయింది. దీంతో మేము భయపడ్డాము. ఆయనవద్దకు వెళ్లలేదు. అంతకుముందు కూడా మామయ్య (ప్రణయ్ తండ్రి)  మీద కేతేపల్లి పోలీసు స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. కేసులో కంప్లెంట్ చేసిన వారి పేర్లు లేవు. కానీ కంప్లెంట్ ఫైల్ అయింది. మామయ్య ఎల్ ఐసి ఏజెంట్ అనుకున్నారు. మనీ మిస్ యూస్ చేశారని కేసులు పెట్టించే ప్రయత్నం చేశారు. కానీ మామయ్య ఎల్ ఐసి ఉద్యోగి. అయినా పోలీసు స్టేషన్ కు పిలిపించి బెదిరించారు. వేధింపులకు గురిచేశారు. ఇలా అయినా నన్ను వాళ్ల ఇంట్లోంచి పంపిస్తారని నాన్న ప్లాన్ ఇది. దీనికి నకిరేకల్ వేముల వీరేశం కూడా ఇన్వాల్వ్ అయ్యారు.

అంతేకాకుండా నా భర్త ప్రణయ్ మీద డ్రగ్ కేసు పెట్టిస్తాం, అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేసినట్లు కేసుులు పెట్టిస్తామని బెదిరించారు. ఆ సమయంలోనే మేము ఐజి స్టీఫెన్ రవీంద్ర ను కలిశాము. ఆయనను కలిసిన తర్వాత కేతేపల్లిలో పోలీసుల వేధింపులు ఆగిపోయాయి. నాకు తెలిసి డాడీకి లోకల్ సర్కిల్ ఉంది తప్ప బీహారీ గ్యాంగ్స్ తో రిలేషన్స్ లేవు. బీహారీ గ్యాంగ్స్ ఇన్వాల్వ్ అయ్యారంటే అది వేముల వీరశం పనే అని నేను అనుకుంటున్నాను. నాన్న వేముల వీరేశం కు డబ్బు ఇచ్చారు.. అందుకే ఆయన బీహార్ వాళ్లను ఇన్వాల్వ్ చేశారని అనుకుంటున్నాను.  

బీహార్ నుంచి తెప్పించే బ్యాక్ గ్రౌండ్ మా నాన్నకు లేదు. మా డాడీ వీరేశంకు చెబితే బీహార్ వాళ్లను వీరేశమే పెట్టించి ఉంటాడని నేను అనుకుంటున్నాను. డాడీ వీరేశంకు డబ్బులు ఇచ్చి ఉంటాడు. డాడీ చెప్పినందుకే వీరేశం నార్త్ ఇండియన్ గ్యాంగ్స్ ను తెప్పించి మర్డర్ చేశారని నాకు అనిపిస్తున్నది. మర్డర్ అంటే ఒకరిద్దరు చంపరు కదా? ప్రణయ్ ని చంపినవాళ్లను పెయిన్ లేకుండా చంపొద్దు. దారుణంగా చంపాలి. ఫ్యూచర్ లో లవ్ మ్యారేజ్ చేసుకున్నవాళ్లను చంపాలంటేనే భయపడేలా పబ్లిక్ గా చంపాలి. 

అమృత మహా టివికి ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో కింద ఉంది చూడొచ్చు.

amrutha interview (maha tv)