వనస్థలిపురంలో విషాదం జరిగింది. పెళ్లైన ఆరు నెలలకే ఆ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. నివేదిత అనే యువతికి 8 నెలల క్రితం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో వివాహం జరిపించారు. వీరు సుష్మా దగ్గరలోని సాయి నగర్ లో కాపురం పెట్టారు. పెండ్లి నాటి నుంచి భర్త వేధింపులకు గురి చేసేవాడని నివేదిత కుటుంబ సభ్యులు తెలిపారు. వేధింపులకు తాళలేక నివేదిత తాము ఉంటున్న నివాసం మీద నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో నివేదిత అక్కడికక్కడే చనిపోయింది. మృతిరాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.