కృష్ణా జిల్లాలో బ్యూటిషియన్ పై హత్యాయత్నం (వీడియో)

కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. హనుమాన్ జంక్షన్ లో ఓ బ్యూటిషియన్ ను కాళ్లు చేతులు నరికి చంపేందుకు ప్రయత్నించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

కృష్ణా జిల్లాలోని వైష్ణావి బ్యూటి పార్లర్ ను పిల్లి పద్మ అనే యువతి నిర్వహిస్తోంది. ఆమెకు సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహమైంది. ఇద్దరున పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో విబేధాలు రావడంతో అతనితో విడిపోయి పిల్లలతో కలిసి బాపులపాడులో నివాసముంటోంది. ఈ క్రమంలోనే పద్మకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడిందని తెలుస్తోంది. పద్మ అచేతనంగా పడి ఉన్న వీడియో కింద ఉంది చూడండి.

శనివారం ఉదయం పద్మ తన ఇంట్లో కాళ్లు చేతులు నరికివేయబడి రక్తపు మడుగులో పడి కొన ఊపిరితో ఉన్న ఉంది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకొని వెంటనే పద్మను 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తే ఆర్దికంగా వచ్చిన తేడాల వల్ల హత్యాయత్నం చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.