బ్రేకింగ్ : మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డ మంత్రి?

murder attempt on ap minister perni nani

ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకున్నది. ఏపీ రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో మంత్రి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మచిలీపట్నంలోని ఆయన ఇంట్లో ఉదయం ఓ వ్యక్తి మంత్రిని కలవడానికి వచ్చాడు. మంత్రి కాళ్లకు దండం పెడుతూ.. వెంట తెచ్చుకున్న పదునైన తాపీతో దాడి చేశాడు.

 

murder attempt on ap minister perni nani
murder attempt on ap minister perni nani

 

తనపై దాడి చేస్తున్నాడని తెలుసుకున్న మంత్రి వెంటనే అప్రమత్తం అయ్యారు. ఇంతలో మంత్రి పక్కనే ఉన్న అనుచరులు.. దాడికి పాల్పడ్డ వ్యక్తిని పట్టుకున్నారు. దీంతో మంత్రి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే దాడికి తెగించిన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దాడి చేసిన వ్యక్తి ఎవరు? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.