గూగుల్ లో వెతికి మరీ బిడ్డను చంపేసింది

తన పిల్లలపై మమకారం చూపించాల్సిన ఓ తల్లి మానవత్వం మరిచి ప్రవర్తించింది. బిడ్డ ఆకలితో అలమటిస్తుంటే తను తినకుండా పిల్లలకు పెట్టి కాపాడుకున్న తల్లులను చూశాం. కానీ ఇక్కడ సీన్ రివర్సయ్యింది. ఆకలితో ఏడుస్తున్న చిన్నారికి పాలు పట్ట చేతగాక శాశ్వతంగా చంపేసింది. ఈ బాధాకరమైన సంఘటన అమెరికాలో జరిగింది.

అమెరికాలోని అరిజోనాలోని చాంద్లర్ కు చెందిన జెన్నా ఫోల్ వెల్ కొద్ది రోజుల క్రితమే మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే పాలు పట్టి లాలించి బుజ్జగించాల్సింది పోయి ఏకంగా చంపాలని నిర్ణయించుకుంది. బిడ్డను చంపడానికి గూగుల్ లో 100 కు పైగా వెబ్ సైట్లలో వెతికింది. బిడ్డను ఎలా చంపాలి, ఆ తర్వాత పోలీసులకు దొరకకుండా ఎలా ఉండాలి అని శోధించింది.

ముద్దుగా ఉన్న చిన్నారి

గూగుల్ లో వెతికిన అనంతరం బిడ్డను తీసుకెళ్లి బకెట్ లోని నీళ్లలో ముంచేసింది. దీంతో ఊపిరాడక చిన్నారి చనిపోయాడు.  బిడ్డ చనిపోయాడని అందరిని నమ్మించింది. పోలీసులు విచారించగా బాత్రూములోకి స్నానానికి వెళ్లానని తనతో పాటు బిడ్డను కూడా తీసుకెళ్లానని అప్పుడు తాను స్పృహ తప్పి పడిపోయానని చెప్పింది. అప్పుడే బిడ్డ జారి బకెట్ లో పడ్డాడని తాను మేలుకోని చూసే సరికి బిడ్డ చనిపోయాడని చెప్పింది.

ఆమె సమాధానం పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఆమె ఫోన్ తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. ఊకే ఏడుస్తుండటంతో తానే తన మగబిడ్డను చంపానని ఒప్పుకుంది. ఆ తర్వాత ఆ చిన్నారి మృతదేహాన్ని  ఓ బ్యాగులో కుక్కింది. ఈ సంఘటన తెలుసుకున్న అంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.