జలీల్ ఖాన్ ఇంట్లో విషాదం

విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరుడి కుమారుడు మోసిన్ ఖాన్ మరణించాడు. 27 ఏళ్ళ మోసిన్ గుండెపోటుతో హఠాత్తుగా గురువారం మృతి చెందాడు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మోసిన్ ఖాన్

మోసిన్ ఖాన్ తండ్రి మున్వర్ ఖాన్ 2015 లో మరణించగా ఆయన మరణానికి కూడా గుండె పోటే కారణం. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా గుండె పోటుతోనే మరణించటం బాధాకరం. అయితే మోసిన్ ఖాన్ అతి చిన్న వయసులోనే గుండె పోటుకు గురయ్యి మరణించటంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. కాగా మోసిన్ కి భార్య, సంవత్సరం వయసు ఉన్న బాబు ఉన్నారు.