మీకు జలీల్ ఖాన్ గుర్తున్నాడా? పోనీ బీకామ్ ఫిజిక్స్ అంటే గుర్తొచ్చిందా? ఎస్.. ఆయనే.. విజయవాడకు చెందిన కీలక నాయకుడు ఆయన. టీడీపీ నేత. కానీ.. ప్రస్తుతం ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. ఆయన రాజకీయ జీవితం ఎటూ కాకుండా అయిపోయిందట. అటూ ఇటూ కాకుండా అయిపోయిందట.
ఎప్పుడైతే వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చాడో అంతే? తన రాజకీయ భవిష్యత్తే అంధకారంలోకి పోయిందని తన అభిమానులు చెబుతున్నారు. నిజానికి జలీల్ ఖాన్ రాజకీయ జీవితం ప్రారంభం అయింది కాంగ్రెస్ తోనే. కాంగ్రెస్ లో ఉన్నప్పుడే ఆయన ఏదో గొడవ జరిగి కాంగ్రెస్ పార్టీని వదిలేశాడు.
ఆ తర్వాత వైఎస్సార్సీపీలో చేరి 2014లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గెలిచారు. కాకపోతే 2014లో వైసీపీ ఓడిపోయింది. టీడీపీ గెలిచింది. దీంతో వెంటనే టీడీపీ లో చేరిపోయారు. మంత్రి పదవి వస్తుందన్న ఆశతో.
కానీ.. బీకాంలో ఫిజిక్స్ తనకు మంత్రి పదవి రాకుండా చేసింది. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఆయన రాజకీయ జీవితమే గందరగోళంలో పడిపోయింది.
కొన్ని రోజుల తర్వాత ఆయన ఆరోగ్యం కూడా అంతగా బాగుండకపోవడంతో.. తన కూతురును 2019 ఎన్నికల్లో బరిలోకి దింపారు. అయితే.. మైనార్టీ వర్గాల్లోనే వాళ్లపై వ్యతిరేకత వచ్చింది. మైనార్టీ మహిళలు రాజకీయాల్లోకి వెళ్లడం ఏంటంటూ విమర్శలు వచ్చాయి.
అయినప్పటికీ… జలీల్ ఖాన్ తన కూతురును ఎమ్మెల్యేగా నిలబెట్టారు. కానీ.. ఆమె ఓడిపోయారు. దీంతో తట్టా బుట్టా సర్దేసుకొని రాజకీయాలకు రాంరాం అన్నట్టుగానే ప్రస్తుతం ఉంటున్నారు.
నిజానికి ఆయన కూతురు అమెరికాలో ఉండేది. ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చి.. ఎన్నికల్లో ఓడిపోవడంతో.. మళ్లీ ఆయన కూతురు అమెరికా వెళ్లిపోయింది. మరోవైపు జలీల్ ఖాన్ ఏదో పేరుకు టీడీపీలో ఉన్నప్పటికీ.. ఆయన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. టీడీపీ కార్యక్రమాలకు కూడా హాజరవడం లేదు.
విజయవాడ లో ప్రస్తుతం ఉన్న ఏ టీడీపీ వర్గంలోనూ ఆయన లేరు. పోనీ.. వైసీపీలో చేరుదామా? అంటే జగన్ తీసుకుంటారా? అనేది పెద్ద ప్రశ్నం. ఎందుకంటే.. 2014లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు కదా.
పోనీ.. జగన్ నుంచి ఏమైనా పిలుపు వస్తుందేమో.. అని వేచి చూస్తున్నారట జలీల్ ఖాన్. కానీ.. జగన్ నుంచి ఎటువంటి పిలుపు లేదు. దీంతో తన రాజకీయ జీవితం అగమ్య గోచరంగా మారిందంటూ జలీల్ ఖాన్ నెత్తీనోరు బాదుకుంటున్నారట. ఇప్పుడు బాదుకొని మాత్రం ఏం లాభం.
మరోవైపు జలీల్ ఖాన్ వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుసుకున్న చంద్రబాబు కూడా జలీల్ ను పట్టించుకోవడం మానేశారు. దీంతో జలీల్ ఖాన్ పరిస్థితి ఎటూ కాకుండా పోయిందని విజయవాడ లో టాక్ నడుస్తోంది.