మరో జలీల్‌ ఖాన్‌ అయిపోయిన విజయసాయి రెడ్డి..!

మరో జలీల్‌ ఖాన్‌ అయిపోయిన విజయసాయి రెడ్డి..!

పాకిస్థాన్ చైనాతో యుద్ధం చేసిందా? ఎప్పుడు చేసింది? పైగా యుద్ధం జరిగినప్పుడు నెహ్రు గారికి ప్రతి పక్షం మద్దతు ఇచ్చిందా..? చరిత్రలో ఎక్కడా దీని గురించి రాయలేదే? ఎవరూ చెప్పనూ కూడా లేదే..? మరి ఈ యుద్దం ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా.. అయితే ఆ యుద్దం కథేంటో మీరో చూడండి..

ప్రజల చేత ఎన్నుకోబడ్డ నేతలకు చరిత్ర గురించి అవగాహన లేకపోయినా పర్వాలేదు గానీ ఏ మాత్రం నోరు జారిన అబాసు పాలు గాక తప్పదు. పైగా ఇప్పుడు నడుస్తున్న సోషల్ మీడియా యుగంలో అయితే ఇక మరీనూ. దీనికి ఓ ఉదాహరణ.. ‘బీకాంలో ఫిజిక్స్’ ఈ మాట అనగానే ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గుర్తొస్తారు. అంతగా ప్రచారం జరిగిపోయింది ఆయన అవగాహనా రాహిత్యానికి. అయితే తాజాగా వైకాపా ముఖ్యనేత, రాజ్య సభ సభ్యుడు విజయ సాయి రెడ్డి కూడా అలాగే ఓ విషయం చెప్పబోయి పొరపాటునో.. లేదా తెలియక అన్నారో గానీ.. భారత చరిత్రలో ఓ ముఖ్య యుద్ధం గురించి.. మాట్లాడి ట్రోల్ అవుతున్నారు. 

ప్రతిపక్షానికి చురకలు అంటించేందుకు.. ఓ పోలికను చెప్తూ.. పాకిస్తాన్, చైనాతో యుద్దం చేసినప్పుడు.. అప్పట్లో ప్రతిపక్షం కూడా నెహ్రూ గారికి సపోర్ట్ చేసింది అంటూ నోరు జారారు. పాపం.. నిజానికి
1962లో జరిగిన చైనా భారత్ యుద్ధం గురించి చెప్పాలనుకున్నారు కాబోలు. అప్పుడు నెహ్రు గారు ప్రధానిగా ఉన్నారు. యుద్ధం సమయంలో ప్రధాన ప్రతిపక్షం కమ్యూనిస్టు పార్టీ. వారిలో ఒక వర్గం చైనాను సమర్ధించింది. అయితే ఈ విషయాన్ని చెప్పబోయిన వీసారే గారు.. ఆ యుద్ధాన్ని కాస్తా పాకిస్తాన్, చైనా యుద్ధంగా చెప్పేసారు.

దీంతో.. ఏంటయ్యా.. విజయసాయి రెడ్డి గారు.. ఇలా ఎక్కువ మాట్లాడకండి.. మీ ప్రతిభ బైట పడుతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు టీడీపీ నేతలు, నెటిజన్లు. ఇది చూశాక అయినా మరి కొందరు నేతలు చరిత్ర, లేదా ముఖ్యమైన అంశాలను చెప్పేప్పుడు కాస్త జాగ్రత్తగా స్క్రిప్టు రాసుకుంటే బాగుంటుంది.