`ఫిరాయింపు ఎమ్మెల్యే` జలీల్‌ఖాన్ ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయట్లేదా? తనకు బదులుగా కుమార్తెను ఆయన బరిలో దింపబోతున్నారా? అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి ఈ సారి జలీల్‌ఖాన్ కుమార్తె షబానా పోటీ చేస్తారని సమాచారం. ప్రస్తుతం అమెరికాలో ఉన్న షబానా స్వస్థలానికి తిరిగి వచ్చారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు.
బుధవారం ఆమె తన తండ్రి జలీల్‌ఖాన్‌తో కలిసి చంద్రబాబును కలిశారు. బీకామ్‌లో ఫిజిక్స్ చదివానంటూ జలీల్‌ఖాన్ చేసిన ఓ ప్రకటన ఆయనను ప్రజల్లో చులకన చేసింది. మంత్రి పదవికి కూడా దూరం కావడానికి ఇదీ ఓ కారణమని అంటున్నారు నెటిజన్లు. కారణాలేమైనప్పటికీ.. ఈ సారి తాను ఎన్నికల్లో పోటీ చేయట్లేదని, కుమార్తెకు అవకాశం ఇస్తున్నానని జలీల్‌ఖాన్ చెబుతున్నారు. అలాగని- తాను రాజకీయాల నుంచి వైదొలగట్లేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని అన్నారు.