8th క్లాస్ పోరడు, లేడీస్ హాస్టల్ లో నగ్న వీడియోలు

ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక పోరడు లేడీస్ హాస్టల్ లో నగ్న వీడియోలు రికార్డు చేసిన సంఘటన హైదరాబాద్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు రికార్డు  చేసినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఒక 8వ తరగతి బాలుడు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటున్న 30 మంది అమ్మాయిల నగ్న వీడియోలు తీశాడు. అమ్మాయిలు బాత్రూమ్ లో స్నానం చేస్తుండగా హాస్టల్ పక్కనే ఉన్న బిల్డింగ్ నుంచి బాలుడు ఆ దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. 

అయితే వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో సెల్ ఫోన్ ఫ్లాష్ లైట్ వెలగడంతో ఒక అమ్మాయి వీడియో రికార్డింగ్ జరుగుతున్న విషయాన్ని పసిగట్టింది. దీంతో ఈ వ్యవహారం బట్టబయలు అయింది. దీంతో హాస్టల్ యాజమాన్యం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వికృత చేష్టలకు పాల్పడిన బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకుని విచారిస్తున్నారు.

అయితే ఆ అమ్మాయిలందరి వీడియోలను తన దగ్గరే ఉంచుకున్నాడా? లేదంటే తన స్నేహితులకు ఎవరికైనా పంపించాడా అన్న అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ బాలుడి నుంచి సమాచారం సేకరించిన పోలీసులకు అతడు 8వ తరగతి చదువుతున్నట్లు తెలిసి షాక్ అయ్యారు. ఆ బాలుడికి తల్లిదండ్రులే సెల్ ఫోన్ కొనిచ్చినట్లు పోలీసులు విచారణలో తేలింది. సెల్ ఫోన్ లో అశ్లీల వీడియోలు చూడడం వల్ల  ఆ బాలుడి ప్రవర్తనలో మార్పు వచ్చి ఇలా వికృత చర్యలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. 

మాదాపూర్ లో జరిగిన ఈ సంఘటన హైదరాబాద్ లో సంచలనం రేపింది. దీనిపై పోలీసుల విచారణ కొనసాగుతున్నది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.