మెట్రో లిఫ్టులు ఏకాంతానికి అడ్డాగా మారాయి. ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన మెట్రో స్టేషన్ లోని లిఫ్టులు అమ్మాయి అబ్బాయిల అసాంఘీక కార్యకలాపాలకు వేదికయ్యాయి. తల్లిదండ్రులు పిల్లలు చదువుకునేందుకు కాలేజికి వెళ్లారని అనుకుంటే ఈ పిల్లలేమో చదువు సంధ్య పక్కకు పెట్టి ప్రేమ మత్తులో మునిగిపోతున్నారు. అంతేనా ఓ అడుగు ముందుకేసి ఎవరూ లేని ప్రదేశాలలో తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు.
మెట్రో స్టేషన్లలో ప్రతి కదలిక సీసీ కెమెరా పరిధిలో ఉంటుంది. స్టేషన్ కు వచ్చినప్పటి నుంచి బయటికి వెళ్లే ప్రతిది కూడా సీసీ కెమెరాలలో రికార్డవుతుంది. ఉప్పల్ లోని కమాండ్ కంట్రోల్ నుంచి వీటిని నిరంతరం పర్యవేక్షిస్తారు. లిఫ్టులలో కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. ఇటీవల సీసీ కెమెరాలు చూస్తుండగా మెట్రో అధికారులకు విస్మయం కలిగించే సీన్లు కన్పించాయి. లిఫ్టులలో ఎవరూ చూడరని కాలేజి అమ్మాయి అబ్బాయిలు లిఫ్టులలో ఉంటూ ముద్దులాటలు ఆడుతున్నారు. అవసరం లేకున్నా లిఫ్టులను ఎక్కుతూ దిగుతూ తమ సరసాలు సాగిస్తున్నారు. దీంతో అలర్టయిన అధికారులు హుందాగా ఉండాలని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ ఘటన పై విచారిస్తున్నామని ఇక నుంచి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూస్తామని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
సీసీ కెమెరాల్లో రికార్డయిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి